Thyroid Disorder: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే చికిత్స తీసుకోండి ఇలా..

సాధారణంగా థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. థైరాయిడ్ వల్ల మహిళల్లో స్థూలకాయం, పీరియడ్స్ క్రమం తప్పడం, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఇంట్లో ఉండే వస్తువులతో థైరాయిడ్ సమస్యను సహజంగా నయం చేసుకోవచ్చు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Thyroid Disorder: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే చికిత్స తీసుకోండి ఇలా..
Thyroid Disorder
Follow us

|

Updated on: Oct 02, 2024 | 8:21 PM

ప్రస్తుతం థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ సమస్యతో మహిళలే ఎక్కువ మంది బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మన మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఇది మన శరీరంలోని జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెడలో ఉండే థైరాయిడ్ గ్రంధి సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి. ఇది థైరాక్సిన్ (T4), ట్రైయోడోథైరోనిన్ (T3) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యను రెండు రకాలుగా విభజించారు వైద్య నిపుణులు. ఒకటి హైపోథైరాయిడిజం, మరొకటి హైపర్ థైరాయిడిజం.

హైపోథైరాయిడిజమ్‌ను అండర్‌యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. ఒక వ్యక్తికి తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేనప్పుడు ఇది సంభవిస్తుంది. అదే సమయంలో శరీరంలో చాలా థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి అయినప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది. ఈ హైపోథైరాయిడిజమే చాలా మంది స్త్రీలు స్థూలకాయం బారిన పడడానికి కారణం.

సాధారణంగా థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. థైరాయిడ్ వల్ల మహిళల్లో స్థూలకాయం, పీరియడ్స్ క్రమం తప్పడం, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఇంట్లో ఉండే వస్తువులతో థైరాయిడ్ సమస్యను సహజంగా నయం చేసుకోవచ్చు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ధనియాలు

ధనియాలల్లో సహజసిద్ధమైన థైరాయిడ్‌ను నియంత్రించే గుణాలు ఉన్నాయి. థైరాయిడ్ నియంత్రణ కోసం ఒక గాజు గ్లాసుని తీసుకుని రెండు చెంచాల ధనియాలు వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్ర లేవగానే వీటిని తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడిజం అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర రసం:

కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్ లెవల్స్ ను క్రమబద్ధీకరించి, థైరాయిడ్ లెవల్స్ ను బ్యాలెన్స్ లో ఉంచుతాయి. థైరాయిడ్ సంబంధిత సమస్య ఎముకల్లో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. కొత్తిమీర రసం ఎముకల నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే కొత్తిమీర ఆకులలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

తులసి ఆకులు అలోవెరా:

తులసి, కలబంద రెండు శక్తివంతమైన ఆకులు. ఈ రెండు శరీరానికి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుతాయి. అయితే వీటిని హైపర్ థైరాయిడ్ రోగులు మాత్రమే తీసుకోవాలి.

తులసి ఆకు రసం థైరాయిడ్ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రెండు చెంచాల తులసి రసాన్ని ఒక చెంచా కలబంద రసంతో కలిపి జ్యూస్‌గా తీసుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కొబ్బరి నూనె:

థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొబ్బరి నూనెను ఔషధంగా తీసుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంధికి బాగా పని చేస్తాయి. అలాగే, కొబ్బరి నూనె జీవక్రియను పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.