AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: మఖానా లేదా మరమరాలు బరువు తగ్గడానికి ఏది మంచివి? నిపుణుల సలహా ఏమిటంటే

బరువు తగ్గడానికి చాలా మంది చిరుతిండిని తినడానికి ఇష్టపడతారు. ఇందుకోసం మఖానా, మరమరాలు మంచి ఎంపిక. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది మంచిదనేది నిపుణుల సలహా తెలుసుకుందాం .. అయితే బరువు తగ్గడానికి వీటిలో ఏది మంచిది అనేది ప్రశ్న. వాస్తవానికి, బరువు తగ్గడానికి మఖానా.. మరమరాలు కంటే మెరుగైన ఎంపిక.

Weight Loss Tips: మఖానా లేదా మరమరాలు బరువు తగ్గడానికి ఏది మంచివి? నిపుణుల సలహా ఏమిటంటే
Murmura Or Makhana
Surya Kala
|

Updated on: Dec 17, 2024 | 8:45 PM

Share

బరువు తగ్గాలనుకుంటే సరైన స్నాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం చూస్తూ ఉంటారు. మఖానా, మరమరాలు ఇష్టమైనవి. ఈ రెండూ తేలికపాటి, తక్కువ కేలరీలు కలిగిన ఉన్న సులభంగా లభించే స్నాక్స్. అయితే బరువు తగ్గడానికి వీటిలో ఏది మంచిది అనేది ప్రశ్న. వాస్తవానికి, బరువు తగ్గడానికి మఖానా.. మరమరాలు కంటే మెరుగైన ఎంపిక. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రొటీన్లు, ఫైబర్, పోషకాహారం ఉంటాయి. అయితే మరమరాలు తేలికపాటి చిరుతిం. సరైన పదార్థాలతో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిట్‌నెస్ కోసం ఏ అల్పాహారం సరైనదో తెలుసుకోవాలి. ఈ రోజు మఖానా, మరమరాలు రెండింటి ప్రయోజనాలను తెలుసుకుందాం..

మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది: మఖానాలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో కొవ్వు , కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే గొప్ప చిరుతిండి. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంది. అంటే మఖనా తినడం వలన గ్లూకోజ్‌ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

మఖానాలు పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహకరిస్తాయి. అయితే మఖానా అతిగా తినకూడదు.

ఇవి కూడా చదవండి

చర్మానికి ఉపయోగం: మఖానాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఇది మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి.

మరమరాల ప్రయోజనాలు

మరమరాల తేలికపాటి, తక్కువ కేలరీలున్న చిరుతిండి. ఆకలిని తీర్చడానికి ఇది సులభమైన ఎంపిక. అంతే కాదు మరమరాలు జీర్ణం అవ్వడం చాలా సులభం. కడుపు తేలికగా ఉంటుంది. వీటిని వేరుశెనగలు, టొమాటోలు, ఉల్లిపాయలతో కలిపి ఆరోగ్యకరమైన చాట్‌గా కూడా తినవచ్చు. అంతేకాదు మరమరాలు తక్కువ కొవ్వు ఎంపిక. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి చిరుతిండి. అంతేకాదు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.

బరువు తగ్గడానికి ఏది మంచిదంటే

మఖానాల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ GI ఆహారాల జాబితాలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతాయి. చాలా కాలం పాటు ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. అయితే మరమరాలు తేలికగా జీర్ణం అవుతాయి. వీటిల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ప్రోటీన్, ఫైబర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతాయి. త్వరగా ఆకలిని కలిగిస్తాయి. వీటిని వేరుశెనగ, టొమాటో, ఉల్లిపాయలు వంటి ఆరోగ్యకరమైన ఇతర పదార్ధాలతో కలిపి తింటే.. మరింత ఆరోగ్యంగా మారుతాయి.

సరైన చిరుతిండిని ఎలా ఎంచుకోవాలంటే

ఎక్కువ కాలం ఆకలిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే.. మఖానాలు మంచివి. ఎందుకంటే మఖానా తినడం వలన కడుపు నిండుగా ఉంటుంది. పోషకాహారం పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్, పీచు, సూక్ష్మపోషకాల వల్ల మఖానాలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. తేలికైన, త్వరగా జీర్ణమయ్యే చిరుతిండిని కోరుకుంటే మరమరాలు ముఖ్యమైన ఎంపిక. ముఖ్యంగా తక్కువ క్యాలరీలు ఉండే చాట్ రూపంలో తినడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)