AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Junnu Pickle: నెల రోజులకు పైగా నిల్వ ఉండే ఎగ్ పికిల్.. రెసిపీ మీ కోసం.. తింటే వావ్ అనాల్సిందే..

కోడి గుడ్డు సంపూర్ణ ఆహారం. రోజుకొక గుడ్డు తినండి ఆరోగ్యంగా జీవించండి అని ప్రభుత్వమే కోడి గుడ్డు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతోంది. కోడి గుడ్డుతో అనేక రకాల ఆహర పదార్ధాలను తయరు చేస్తారు. కోడి గుడ్డు కూర, ఫ్రై, కోడి గుడ్డు అట్టు, ఎగ బిర్యానీ, కోడి గుడ్డు పులుసు వంటి రకరకరాల వంటకాలను తయారు చేస్తారు. అయితే కోడి గుడ్డుతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు అని తెలుసా..

Egg Junnu Pickle: నెల రోజులకు పైగా నిల్వ ఉండే ఎగ్ పికిల్.. రెసిపీ మీ కోసం.. తింటే వావ్ అనాల్సిందే..
Egg Junnu Pickle Recipe
Surya Kala
|

Updated on: Dec 17, 2024 | 6:57 PM

Share

కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోడి గుడ్డుని తినే ఆహారంలో చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు. కోడి గుడ్లతో రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. అంతేకాదు కొందరు కోడి గుడ్డుని ఉడకబెట్టుకుని ఉదయమే అల్పాహారంగా తీసుకుంటారు కూడా. అయితే కోడి గుడ్డుతో జున్ను లా తయారు చేసుకునే నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన కోడి గుడ్డి జున్ను పచ్చడిని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రుచికరమైన ఎగ్ జున్ను పికిల్ తయారీ రెసిపీ గురించి తెల్సుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. కోడి గుడ్లు – 7
  2. ఆవ పిండి – 2 స్పూన్లు
  3. ధనియాల పొడి- 1 స్పూన్
  4. మెంతి పొడి- పావు స్పూన్
  5. ఇవి కూడా చదవండి
  6. మిరియాల పొడి -1 స్పూన్
  7. గరం మసాలా పొడి – 1 స్పూన్
  8. పసుపు – చిటికెడు
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
  10. నిమ్మరసం – అరకప్పు
  11. ఉప్పు – రుచికి సరిపడా
  12. కారం- 3 స్పూన్లు
  13. నూనె – కావలసినంత
  14. కరివేపాకు- నాలుగు రెమ్మలు

ఎగ్ జున్ను పికిల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి రెండు గ్లాసుల నీరు పోసి వేడి చేయండి.. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అంచులకు నూనె రాసి అందులో కోడి గుడ్లు కొట్టి.. తెల్ల, పచ్చ సోనలను వేసి అందులో కొంచెం పసుపు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి.. గుడ్ల సొనలో కలిసేలా గరిటతో కలిపి ఆ గిన్నె మీద మూత పెట్టి కుక్కర్ లో పెట్టి తక్కువ మంట మీద ఉడికించండి. ఉడికిన గుడ్ల మిశ్రమం జున్నులా తయారు అవుతుంది. తర్వత కుక్కర్ నుంచి గిన్నెను తీసి ముక్కలుగా కట్ చేయాలి.

ఇప్పుడు స్టవ్ మీద ఓ బాణలి తీసుకుని అందులో ఒక కప్పు నూనె పోసి వేడి ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, ఆవ పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా వేయించండి. తర్వాత కారం, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి వేయించండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ బాణలి లో నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోడి గుడ్డు జున్ను ముక్కలను వేసి వేయించండి. కోడి జున్ను ముక్కలు డీప్ ఫ్రై చేసుకుని గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత.. రెడీ చేసుకున్న మాసాలా మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు వేయించాగా మిగలిన నూనెను మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపండి. ఇప్పుడు కోడి గుడ్డు జున్ను మిశ్రమంలో అరకప్పు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసి తక్కువైతే సరిపడా వేసుకుని కలుపుకోవాలి. అంతే రుచికరమైన కోడి గుడ్డు జున్ను నిల్వ పచ్చడి రెడీ. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అని తీరాల్సిందే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..