AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!

చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి..అవేంటంటే..

శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!
Raw Onion
Jyothi Gadda
|

Updated on: Dec 17, 2024 | 1:09 PM

Share

వంటగదిలో ఉల్లిపాయది అతి ముఖ్యమైన స్థానం. ఎందుకంటే ఉల్లిపాయ లేకుండా ఏ వంటకం పూర్తి కాదు. ఇకపోతే, ఉల్లిపాయలో కూడా రకాలు ఉన్నాయి. వాటిలో రెండు రకాలు ఒకటి చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ. ఇందులో పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పచ్చిగా తింటే మరీ ఫలితాలు పొందుతారని మన పూర్వీకులు చెప్పేవారు. ముఖ్యంగా చలికాలంలో ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చిన్న ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటు వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అటువంటి పరిస్థితిలో చిన్న ఉల్లిపాయలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, అంటు వ్యాధులతో పోరాడడంలో చాలా సహాయపడుతుంది. అందుకే దీన్ని పచ్చిగా తినడం వల్ల చలికాలంలో వచ్చే అంటు వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

చిన్న ఉల్లిపాయ ప్రకృతిలో వేడిగా ఉంటుంది. అందుకే చలికాలంలో పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ పచ్చిగా తినడం మంచిది. ఎందుకంటే ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని అనవసరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల, శీతాకాలంలో ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చిన్న ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. కాబట్టి చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి దీన్ని రోజూ తీసుకోవాలి. చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి