AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar 2024: త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు పట్టిందల్లా బంగారమే..

శనీశ్వరుడు అధినేత అయిన కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. శుక్రుడి ఈ రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే శుక్రుడు రాశి మార్పుతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. శుక్రుడి రాశి మారడం వల్ల ఈ మూడు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఈ మూడు అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

Shukra Gochar 2024: త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు పట్టిందల్లా బంగారమే..
Venus Transit 2024
Surya Kala
|

Updated on: Dec 17, 2024 | 5:05 PM

Share

రాక్షస గురువు శుక్రుడు ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఒక రాశిలో ఒక నెల పాటు ఉంటాడని వేద జ్యోతిష్యం చెబుతోంది. డిసెంబర్ 28న శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశిలో శుక్రుని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇలా శుక్రుడు మార్పు ముఖ్యంగా మూడు రాశులకు చెందిన వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. వీరు అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలను పొందనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం వృషభ రాశికి చెందిన వ్యక్తులకు గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వృషభ రాశిలోని కర్మ గృహంలో సంచరించనున్నాడు. ఈ కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వృషభ రాశి వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతేకాదు వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఈ కాలంలో పురోగతికి కొత్త అవకాశాలను పొందనున్నారు. ఈ సమయంలో వ్యాపారస్తులకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం మేష రాశి వారికి లాభదాయకమైన పరిస్థితిని సృష్టించగలదు. ఎందుకంటే ఈ కాలంలో శుక్రుడు మీ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఆదాయ, లాభ గృహంలో ఉంటాడు. దీని వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు ఉద్యోగరీత్యా మేష రాశి వారికి పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారంలో భారీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. దీంతో వీరు భవిష్యత్తులో భారీ లాభాలను ఆర్జిస్తారు. స్టాక్ మార్కెట్ సహా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం శుభ సమయం.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ శుక్రుని సంచారము వలన శుభ ఫలితాలు పొందనున్నారు. ఈ కాలంలో శుక్రుడు మిథునరాశి వ్యక్తుల విధి స్థానంలో సంచరించనున్నాడు. అదృష్టం వీరి సొంతం. పేదలకు ఆహారం, నిత్యవరస వస్తువులు వంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే