AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes and Exercise: షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తింటే ఆందోళన వద్దు.. ఈ వ్యాయామం చేస్తే షుగర్‌ లెవెల్‌ అదుపులో ఉంటుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ స్వీట్లు తినకూడదని నిపుణులు సలహా ఇస్తారు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు పొరపాటున స్వీట్లు తింటే భయపడాల్సిన అవసరం లేదు. స్వీట్లు తిన్న నాలుగు గంటలలోపు ఈ వ్యాయామాలు చేయడం వల్ల షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెప్పారు.

Diabetes and Exercise: షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తింటే ఆందోళన వద్దు.. ఈ వ్యాయామం చేస్తే షుగర్‌ లెవెల్‌ అదుపులో ఉంటుంది
Diabetes And Exercise
Surya Kala
|

Updated on: Dec 17, 2024 | 8:21 PM

Share

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదు. ఇది షుగర్ పేషెంట్స్ ఆరోగ్యానికి హానికరం. అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులు అనుకోకుండా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నట్లయితే, భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వీటిని పాటించడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అన్నింటిలో మొదటిది ఆహారంలో స్వీట్లు తిన్న తర్వాత, తదుపరి ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండేలా ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పప్పులు, కిడ్నీ బీన్స్ తినండి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఆహారంతో పాటు వ్యాయామం కూడా ముఖ్యం.

స్వీట్లు తిన్న 4 గంటల రెండు గంటలలోపు ఈ వ్యాయామం చేస్తే శరీరంలో షుగర్ లెవెల్ పెరగదు. ఎందుకంటే వ్యాయామం చేసే సమయంలో శరీరానికి శక్తి అవసరం. అప్పుడు శరీరం రక్తంలోని గ్లూకోజ్‌ని ఉపయోగిస్తుంది. గ్లూకోజ్ వాడకం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో ఏ వ్యాయామం సహాయపడుతుందో ఢిల్లీలోని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ స్వప్నిల్ జైన్ చెప్పిన సలహాలు తెలుసుకుందాం..

చురుకైన నడక

డయాబెటిక్ పేషెంట్ ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే చురుకైన నడక షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని డాక్టర్ స్వప్నిల్ జైన్ చెప్పారు. స్వీట్లు తిన్న 4 గంటల్లో ఈ వ్యాయామం చేయవచ్చు. బ్రిస్క్ వాక్ ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బ్రిస్క్ వాక్ అనేది ఒక రకమైన ఫాస్ట్ వాకింగ్. ఇది అలాంటి నడకలో చాలా వేగంగా నడవాలి. గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. అయితే పరుగు పెట్టకూడదు. వేగంగా నడవాలి. అరగంట పాటు వేగంగా నడవవచ్చు.

ఇవి కూడా చదవండి

చురుకైన నడక హృదయ స్పందన రేటును పెంచడంలో పాటు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది. బ్రిస్క్ వాక్ కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చురుకైన నడక అంటే వేగంగా నడవడం అంతే. ఇందులో లక్ష్యంగా నిమిషానికి 100 నుంచి 135 అడుగులు నడవాల్సి ఉంటుంది.

గోడ కుర్చీ

వాల్ సిట్ అనేది ఇంట్లో సులభంగా చేసే వ్యాయామం. గోడకు వ్యతిరేకంగా నిలబడి కాళ్ళను భుజం స్థాయి వరకూ వచ్చేలా కూర్చోండి. ఇప్పుడు కుర్చీ పోజులో ఉండటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో శ్వాసను కొన్ని సెకన్ల పాటు అదుపులో ఉంచి ఆపై దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం చేయడం ద్వారా శరీరం గ్లూకోజ్‌ని వేగంగా వినియోగించుకుంటుంది. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.