AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Walk Benefits: నిద్ర లేచిన వెంటనే రోజూ 30 నిమిషాలు మార్నింగ్ వాక్‌ చేస్తే.. ఊహించలేనన్ని లాభాలు!

ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 30 నిమిషాలు మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందట. కేలరీలు బర్న్ చేయడం నుంచి మానసిక ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరగంట పాటు నడవడం వల్ల ఎలాంటి..

Morning Walk Benefits: నిద్ర లేచిన వెంటనే రోజూ 30 నిమిషాలు మార్నింగ్ వాక్‌ చేస్తే.. ఊహించలేనన్ని లాభాలు!
Morning Walk Benefits
Srilakshmi C
|

Updated on: Aug 20, 2025 | 2:00 PM

Share

మార్నింగ్‌ వాకింగ్‌ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన వ్యాయామం. అందుకే చాలా మంది ఉదయాన్నే జిమ్‌ లేదా పార్క్‌లలో వాకింగ్‌కి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 30 నిమిషాలు మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందట. కేలరీలు బర్న్ చేయడం నుంచి మానసిక ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరగంట పాటు నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

మార్నింగ్ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ఎనర్జీ అందిస్తుంది

ఉదయం నిద్రలేచిన వెంటనే 30 నిమిషాలు నడవడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. దీంతో రోజంతా చురుకుగా ఉండటానికి వీలు కల్పిస్తుంది. మార్నింగ్ వాక్ మిమ్మల్ని రోజంతా అప్రమత్తంగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మార్నింగ్ వాక్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. ఉద్రిక్తత, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది అలసట, నిరాశ సమస్యలను కూడా తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలోనూ భలే మ్యాజిక్‌

మార్నింగ్ వాక్ అనేది ఒక సాధారణ వ్యాయామం. ఉదయం నిద్రలేచిన వెంటనే 30 నిమిషాలు నడవడం వల్ల 150 కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి

ప్రతి ఉదయం 30 నిమిషాలు నడవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. మార్నింగ్ వాక్ శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు

మార్నింగ్ వాక్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే మార్నింగ్ వాక్ వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

మంచి నిద్ర

ఉదయం 30 నిమిషాల నడక మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

ఉదయం గాలి, వాతావరణం ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ముప్పై నిమిషాలు మార్నింగ్ వాక్ చేయడం వల్ల మెదడుకు మంచి ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా బలపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..