AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను యువ పారిశ్రామికవేత్తలకు గేట్స్‌ వివరించారు. తాజాగా జెరోదా సంస్థ కో ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్‌ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు...

Bill Gates: బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
Bill Gates
Narender Vaitla
|

Updated on: Jun 22, 2024 | 7:13 AM

Share

ఆరోగ్యంగా జీవించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక జీవితంలో విజయాన్ని సాధించాలంటే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జీవితంలో ఉన్న స్థానంలో ఉన్న చాలా మంది కచ్చితంగా ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధతో ఉంటారు. ఆరోగ్యాన్ని అస్సలు విస్మరించారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను యువ పారిశ్రామికవేత్తలకు గేట్స్‌ వివరించారు. తాజాగా జెరోదా సంస్థ కో ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్‌ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. పని పరంగా ఎంత బిజీగా ఉన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆరోగ్య సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. ఇక తన హెల్త్‌ సీక్రెట్‌ గురించి వివరిస్తూ.. ఎక్కువగా విటమిన్లు తీసుకుంటానని, దీనివల్ల ఎలాంటి ప్రతికూలతలు ఉండబోవని చెప్పారు. ఈ సందర్భంగా బిల్‌ గేట్స్‌ గ్రెయిల్‌ టెస్ట్‌ ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఈ టెస్ట్‌ సహాయంతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని, డీఎన్‌ఏ జన్యువులను సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.

ఇక కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని గేట్స్‌ సూచించారు. ఇందుకోసం కంటి నిండ నిద్రపోవడమే మార్గం అని తెలిపారు. సరిగ్గా నిద్ర ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. యుక్త వయసు నుంచే ఎక్కువ సేపు నిద్రపోవడం అలవర్చుకోవాలని, మలివయసులో దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, తాను కూడా దీన్నే పాటిస్తానని బిల్‌ గేట్స్‌ తన హెల్త్ సీక్రెట్‌ను వివరించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us