AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..

వాస్తు అనేది కేవలం దిశల వివరణ కాదు.. అది మన జీవితాన్ని నడిపించే ఒక శక్తి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూల మన ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మూలస్తంభం వంటిది. ఇక్కడ ఉండే సానుకూలత మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదే ఇక్కడ దోషం ఉంటే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అసలు ఈశాన్య మూలను ఎలా ఉంచుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..
Vastu Tips For North East Corner
Krishna S
|

Updated on: Apr 20, 2026 | 10:13 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రతి అణువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో రూపాయి నిలవకపోవడం, ఇంట్లో నిత్యం గొడవలు లేదా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? అయితే మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో దోషం ఉన్నట్లేనని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈశాన్యం అంటే దైవ మూల. ఈ దిశలో చేసే చిన్న చిన్న మార్పులు మీ తలరాతనే మార్చేయగలవు.

దేవతల దిశ.. ఈశాన్యం

ఇంటికి ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. దీనిని సాక్షాత్తు దేవతల దిశగా, సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. ఈ మూల ఎంత ప్రశాంతంగా ఉంటే, ఆ ఇంట్లో అంతగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందుకే వాస్తులో ఈశాన్యానికి పెద్దపీట వేశారు.

ఈశాన్యం బరువు కాకూడదు

చాలామంది ఈశాన్య మూలలో పాత సామాన్లు, ఇనుప వస్తువులు లేదా బరువైన అల్మారాలు పెడుతుంటారు. ఇది వాస్తు ప్రకారం పెద్ద తప్పు. ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, తేలికగా ఉండాలి. ఇక్కడ బరువైన ఫర్నిచర్ ఉంచితే అదృష్టం ఆగిపోతుంది. అలాగే ఈ మూలలో చెత్తను లేదా మురికిని ఉండనివ్వకండి.

పూజా మందిరం – ఐశ్వర్యానికి మూలం

ఇంటికి ఈశాన్య మూలలో గుడి లేదా పూజా గది ఉండటం అత్యంత శుభప్రదం. ప్రతిరోజూ ఇక్కడ దీపం వెలిగించి, సువాసనగల అగరబత్తులు వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల పురోగతికి బాటలు వేస్తుంది.

నీటితో నిండిన ఐశ్వర్యం

ఈశాన్యం జల తత్వానికి సంబంధించింది. ఈ దిశలో నీటి వనరులు ఉండటం సంపదను ఆకర్షిస్తుంది. ఒక చిన్న నీటి ఫౌంటెన్ లేదా అక్వేరియం లేదా కనీసం ఒక పాత్రలో స్వచ్ఛమైన నీటిని ఉంచండి. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది.

వెలుతురు.. గాలి.. ప్రశాంతత:  ఈశాన్య మూల గదులకు లేత రంగులు వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కిటికీలు ఉండటం వల్ల సహజమైన వెలుతురు, గాలి ప్రసరించి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. చీకటిగా ఉండే ఈశాన్యం మానసిక ఆందోళనలకు దారితీస్తుంది.

Follow Us
మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే..
మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే..
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..