AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ వాడేవారికి సూపర్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త రూల్.. ఇకపై..

యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపుతున్నారా.. లేదా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే జూన్ 1 నుంచి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎల్లుడి నుంచి కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్తగా రానున్న ఈ మార్పులు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

UPI Payments: యూపీఐ వాడేవారికి సూపర్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త రూల్.. ఇకపై..
Upi 1
Venkatrao Lella
|

Updated on: May 30, 2026 | 4:11 PM

Share

జూన్ నెల ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో దేశ ప్రజల ఆర్ధిక కార్యకలాపాలను ప్రభావితం చేసే అనేక కొత్త మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త నెల మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అనేక మార్పులను తీసుకువస్తోంది. ప్రధానంగా యూపీఐ, ఏటీఎం నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. వీటి గురించి ముందే తెలుసుకోవడం వల్ల ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే సమయంలో జాగ్రత్త పడవచ్చు. ఇంతకు యూపీఐ, ఏటీఎం లావాదేవీల్లో జరగనున్న మార్పులు ఏంటి అనేది చూద్దాం.

యూపీఐ లావాదేవీల్లో పెద్ద మార్పు

జూన్ 1వ తేదీ నుండి యూపీఐ లావాదేవీల్లో పెద్ద మార్పు జరగనుంది. అదేంటంటే.. ఇక నుంచి మీరు యూపీఐ ద్వారా ఎవరికి అయినా డబ్బులు బదిలీ చేస్తే.. వారి అసలు బ్యాంకులో నమోదైన పేరు మీకు కనిపిస్తుంది. యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా డబ్బులు పంపితే బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లుగానే పేరు కనిపిస్తుంది. దీని వల్ల మీరు సరైన వ్యక్తికి డబ్బులు పంపుతున్నారా.. లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఏటీఎం లావాదేవీల్లో మార్పులు ఇవే..

జూన్ 1వ తేదీ నుండి చాలా బ్యాంకులు తమ ఏటీఎం లావాదేవీల విధానాలలో మార్పులు చేస్తున్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో జరిపేప ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించనున్నాయి. ఏటీఎంలలో నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్‌ చూడటం వంటి సేవలు మరింత ఖరీదు కానున్నాయి. ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసేవారికి ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. మీరు ఇతర బ్యాంక్ ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేయాలంటే జూన్ 1వ తేదీ నుంచి జరిగే మార్పులను గమనించడం మంచిది.

Follow Us
తొలుత జిడ్డు.. ఆ తర్వాత ఊచకోత.. తెలుగోడి ఫినిషింగ్ టచ్ అదుర్స్
తొలుత జిడ్డు.. ఆ తర్వాత ఊచకోత.. తెలుగోడి ఫినిషింగ్ టచ్ అదుర్స్
జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. మీ ఆధార్ వివరాలన్నీ..
జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. మీ ఆధార్ వివరాలన్నీ..
ఫోటో చూసి అమాయకుడు అనుకోవద్దు.. ఇతని క్రైమ్ హిస్టరి తెలిస్తే..
ఫోటో చూసి అమాయకుడు అనుకోవద్దు.. ఇతని క్రైమ్ హిస్టరి తెలిస్తే..
చీకటి గదిలో కిరోసిన్ దీపం, కొవ్వొత్తి.. మొదట దేన్ని వెలిగిస్తారు?
చీకటి గదిలో కిరోసిన్ దీపం, కొవ్వొత్తి.. మొదట దేన్ని వెలిగిస్తారు?
ఒక్క గొడవతో మధ్యలోనే ఆగిపోయిన తరుణ్ సినిమా.. అసలేం జరిగిందంటే..
ఒక్క గొడవతో మధ్యలోనే ఆగిపోయిన తరుణ్ సినిమా.. అసలేం జరిగిందంటే..
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే?
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే?
ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రే క్లీన్
ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రే క్లీన్
58 ఏళ్లు దాటాక పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా..? కేంద్రం క్లారిటీ
58 ఏళ్లు దాటాక పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా..? కేంద్రం క్లారిటీ
పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం..
పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం..
రోజూ చేసే ఈ 3 తప్పులే వెన్నెముకకు ముప్పు.. నిర్లక్ష్యం చేయొద్దు!
రోజూ చేసే ఈ 3 తప్పులే వెన్నెముకకు ముప్పు.. నిర్లక్ష్యం చేయొద్దు!