వర్షం పడగానే ఈ చిన్న పని చేయండి.. చెట్టు నిండా జామకాయలు కాస్తాయ్..
Samatha
30 May 2026
చాలా మంది ఇంటిలో తప్పక ఉండే పండ్ల చెట్లలో జామ చెట్టు ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పట్టణంలో కూడా ప్రతి ఇంటిలో ఇది తప్పక ఉంటుంది.
జామ చెట్టు
అయితే తొలకరి వర్షాలు మొదలు కాగానే జామ చెట్టు కొత్త చిగురు వేసి, పూత పూస్తుంది. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మొదటి జామ కాత చాలా ఎక్కువగా కాస్తుందంట.
తొలకరి వర్షం
తొలకరి చినుకులు పడగానే, జామ చెట్టు లేత కొమ్మలను కత్తిరంచాలంట. ఇలా చేయడం వలన ఎక్కువ పూత పూసి, కాయలు ఎక్కువ వస్తాయి.
కొమ్మల కత్తిరింపులు
అదే విధంగా, వర్షం పడిన తర్వాత నేల తడిగా ఉంటుంది. ఆ సమయంలో ఆవు పేడ, వేప పిండి లాంటివి వేయడం వలన చెట్టు వేపుగా పెరుగుతుంది.
ఎరువులు వేయడం
అలాగే అరటి తొక్కల పొడి, పొటాష్ వంటివి కూడా జామ చెట్టుకు రెండు అడుగుల దూరంలో వేయాలి. దీని వలన పూత ఎక్కువగా వచ్చి, కాయలు ఎక్కువగా కాస్తుంది.
ఎక్కువ పూత
అదే విధంగా చెట్టు నిండా పూత వచ్చిన తర్వాత అది రాలకుండా ఉండటానికి ఒక మిల్లీ లీటర్ నీటిలో బెల్లం, మజ్జిగా కలిపి వీటిని ఒక రోజు ముందు రాత్రి పులియబెట్టాలి.
పూత రాలకుండా
మరసటి రోజు ఉదయం స్ప్రే చేయాలి. దీని వలన జామ పూత రాలకుండా ఉంటుంది. చెట్టు నిండా ఉన్న పూలు అలాగే ఉండి, ఎక్కువ కాయలు కాస్తుంది.
స్ప్రే చేయడం
ఇలా వర్షాకాలం చేయడం వలన జామ చెట్టు నిండుగా కాయలు కాయడమే కాకుండా, ఆ కాయల రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట.