AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో సామాన్యులకు మరో దర్శన అవకాశం..

తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు. టీటీడీ సామాన్యులకు దర్శనాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తోమాల సేవ సమయంలో కూడా దర్శనాలకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించనుంది. భక్తుల రద్దీని తగ్గించేందుకు, వేగంగా దర్శనాలు కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో సామాన్యులకు మరో దర్శన అవకాశం..
Tirumala Tirupati Devasthanam
Venkatrao Lella
|

Updated on: May 30, 2026 | 3:32 PM

Share

వేసవి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. విద్యాసంస్థలకు వేసవి సెలవులు కావడంతో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళుతున్నారు. దీంతో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ ఉండగా.. టీటీడీ వేగంగా దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ఇటీవల అభిషేక సేవ సమయంలో కూడా భక్తులను దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

తోమాల సేవ సమయంలో కూడా దర్శనం

ఈ క్రమంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలో కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. తిరుమలలో రద్దీ పెరుగుతున్న వేళ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ వారం శ్రీవారి తోమాల సేవ సమయంలో 1200 మంది భక్తులను దర్శనాలకు టీటీడీ అధికారులు అనుమతించనున్నారు. గత వారంలో శ్రీవారి అభిషేక సేవ సమయంలో 5850 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీతో గత శుక్రవారం ఏకంగా 87,689 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరిత్రలో శుక్రవారం ఎక్కువమంది దర్శించుకోవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లు, కొండపై భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా సకల ఏర్పాట్లు చేసింది. త్రాగునీరు, ఆహారం, గదులు అందుబాటులో ఉండేలా చూస్తోంది.

Follow Us
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు