సింగర్ మంగ్లీని మైక్రో ఫైనాన్స్ వివాదం చుట్టుముట్టింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్లకే పరిమితం కాకుండా ఫిలిం నగర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంపత్ నాయక్ ఆమెపై తీవ్రంగా స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.