AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: కన్నబిడ్డను కాపాడుకునేందుకు తల్లి పోరాటం.. అండగా నిలిచిన సోనూసూద్.. గుండె తరుక్కుపోయే వీడియో

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి అండగా నిలిచి కొత్త జీవితాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Sonu Sood: కన్నబిడ్డను కాపాడుకునేందుకు తల్లి పోరాటం.. అండగా నిలిచిన సోనూసూద్.. గుండె తరుక్కుపోయే వీడియో
Sonu Sood
Basha Shek
|

Updated on: Apr 21, 2026 | 9:21 AM

Share

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికే తన సేవా కార్యక్రమాలతో ఎన్నో జీవితాల్లో వెలుగు నింపిన ఆయన తాజాగా మరో చిన్నారికి ప్రాణం పోశారు. తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న ఓ పాపకు దగ్గరుండి శస్త్రచికిత్స చేయించి తల్లి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమార్తె ‘నీరా’ను తీసుకుని ఓ తల్లి నటుడు సోనూసూద్ ఇంటికి వెళ్లింది. తన బిడ్డకు ఉన్న ప్రాణాప్రాయ వ్యాధి గురించి నటుడికి వివరించింది. మెడికల్ రిపోర్టులను అన్నింటిని చూపించింది. దీంతో తక్షణమే స్పందించిన సోనూసూద్ తన ట్రస్ట్ సభ్యులతో మాట్లాడారు. అలాగే నీరాకు చికిత్స చేస్తోన్న వైద్యులతో మాట్లాడారు. పాప మెడికల్ కండిషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం జూపిటర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో నీరాకు దగ్గరుండి శస్రచికిత్స చేయించారు. తద్వారా ఆ పాపకు కొత్త జీవితాన్ని అందించి తల్లి కళ్లల్లో ఆనందాన్ని నింపారు.చిన్నారికి శస్త్రచికిత్స పూర్తైన తర్వాత సోనూసూద్ నీరాను ఎత్తుకుని ముద్దాడారు. చాక్లెట్ ఇచ్చి కాసేపు సరదాగా ఆడించారు. ఆ తర్వాత తనే స్వయంగా నీరాను తల్లికి అప్పగించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సోనూసూద్.

ఇవి కూడా చదవండి

‘కొన్నిసార్లు ఆశ నిలవాలంటే పట్టు వదలని వారు కావాలి. ఎన్నో చోట్ల నుంచి ‘కాదు’ అనే సమాధానం విన్న తర్వాత, చిన్నారి నీరా తల్లి దాదాపు ఆశలు వదిలేసుకుంది. రిస్క్ ఎక్కువ, ఛాన్సులు చాలా తక్కువ. కానీ దేవుని కృప, జూపిటర్ హాస్పిటల్స్‌లోని అద్భుతమైన వైద్య బృందం సహాయ సహకారాలతో మేం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు, నీరా ఒక కొత్త జీవితంతో నవ్వుతోంది. అసాధ్యం అనిపించిన దానిని ఒక అద్భుతంగా మార్చిన డాక్టర్ ఖాలిద్ షేక్, డాక్టర్ అశుతోష్, వారి బృందం మొత్తానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎవరూ జీవితంపై ఆశ వదులుకోవద్దు. మనం ఐక్యంగా నిలబడితే, ఎంతటి కఠినమైన ఇబ్బందులనైనా అధిగమించవచ్చు. సహాయం చేస్తూనే ఉందాం ‘అని సోనూసూద్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రియల్ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పాప నీరాతో సోనూసూద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us