AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

హీరో మోటోకార్ప్ విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైంది. రూ.44,490 ప్రారంభ ధరతో, ఇది సామాన్య వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. VX2 ప్లస్ (142 కి.మీ రేంజ్), VX2 గో (92 కి.మీ రేంజ్) అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!
Hero Vida Vx2 Electric Scoo
SN Pasha
|

Updated on: Apr 21, 2026 | 9:48 AM

Share

భారత ఈవీ మార్కెట్‌లో పోటీని మరింత వేడెక్కించేలా హీరో మోటోకార్ప్‌ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విడా VX2ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర, మంచి రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.44,490గా ఉండగా, షోరూమ్‌, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

విడా VX2ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది VX2 ప్లస్, VX2 గో. VX2 ప్లస్‌లో 3.4 kWh బ్యాటరీ ఉండగా, ఒకే ఛార్జ్‌తో గరిష్టంగా 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. మరోవైపు VX2 గో వేరియంట్‌లో 2.2 kWh బ్యాటరీ సామర్థ్యం ఉండి, ఇది సుమారు 92 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 కిలోవాట్ల శక్తి గల మోటార్‌ను అమర్చారు. ఇది కేవలం 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదనంగా, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా కల్పించబడింది. దీని ద్వారా సుమారు 60 నిమిషాల్లోనే బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రాక్టికాలిటీ విషయంలో కూడా ఈ మోడల్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. VX2 ప్లస్ వేరియంట్‌లో సీటు కింద 33.2 లీటర్ల నిల్వ స్థలం ఉండగా, VX2 గోలో 27.2 లీటర్ల స్టోరేజ్ అందించారు. బ్యాటరీపై కంపెనీ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం కూడా వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచే అంశంగా చెప్పుకోవచ్చు. మంచి రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్, సరసమైన ధరతో విడా VX2 ఈవీ విభాగంలో కొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us