హేమక్కా నేను తప్పు చేశా.. వీడియో రిలీజ్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ తమన్నా సింహాద్రి గత కొన్నాళ్లుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న ఆమె ఆ వెంటనే తాను గర్భవతినని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో నటి హేమపై వచ్చిన డ్రగ్స్ కేసు వివాదం గురించి అందరికి తెలిసిందే. ఆ సమయంలో తాను ఏ తప్పు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి ఎంత పోరాడినా హేమపై అనేక మీడియా ఛానల్స్ విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు హై కోర్టు హేమకు క్లీన్‌చిట్ ఇవ్వటంతో హేమ ఆనందంతో ప్రెస్‌మీట్ పెట్టి మరి తాను తప్పు చేయలేదని తన నిర్దోషత్వాన్ని నిరూపించును అన్నారు. మీడియాతో కలిసి బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి కూడా ఆ సమయంలో మితిమీరి నోటికొచ్చినట్లు పెదార్థాలతో మాట్లాడింది. ఆ సమయంలో అలా మాట్లాడిన కరాటే కళ్యాణి , తమన్నా సింహాద్రిపై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేశారు హేమ. ఇప్పుడు హేమ విషయంలో తన తప్పు తెలుసుకుని తాను తప్పు చేశానని సోమవారం ఒక వీడియో ద్వారా నన్ను క్షమించమని తమన్నా హేమని కోరారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
‘ సారీ హేమక్కా.. అందరూ నీ మీద బురదచల్లుతున్నప్పుడు నేను మీ వైపు నిలబడి ఉండాల్సింది. కానీ నేను కూడా వారితో కలిసిపోయి మీపై బురద చల్లాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసిన దానికి పశ్చిత్తాపపడుతున్నాను. నన్ను క్షమించండి’ అని చెప్పుకొచ్చింది తమన్నా. మరి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.
