AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

Phani CH
|

Updated on: Apr 20, 2026 | 7:49 PM

Share

ఢిల్లీ పోలీసులు థాన్ సింగ్ స్థాపించిన పాఠశాల నుండి పదో తరగతిలో పాసైన ఓ విద్యార్థిని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తల్లికి శుభవార్త చెబుతూ భావోద్వేగానికి గురైన ఈ వీడియో వైరల్‌గా మారింది. పేదల విద్యకు థాన్ సింగ్ కృషి ఎంతగానో ప్రశంసించబడింది, ఇది ఆ అమ్మాయి భవిష్యత్తుకు కీలక మలుపని నెటిజన్లు కొనియాడారు.

పదో తరగతి పరీక్షల్లో తను పాసైనట్లు తెలుసుకున్న ఓ విద్యార్థిని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన ఆనందాన్ని తల్లితో పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. వైరల్‌గా మారిన వీడియో నెట్టింట మనసులను గెలుచుకుంటోంది. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ థాన్ సింగ్, పేద పిల్లల కోసం ‘థాన్ సింగ్ కీ పాఠశాల’ పేరుతో ఓ సంస్థను నడుపుతూ ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఆ పాఠశాల విద్యార్థిని పాసైంది. గుడ్‌ న్యూస్‌ను ఆ బాలిక తల్లికి చెప్పేందుకు థాన్ సింగ్ ఫోన్ చేశారు. “మీ అమ్మాయి పాసైంది, మాట్లాడండి” అని చెప్పి ఫోన్‌ను ఆమె చేతికి ఇచ్చారు. ఫోన్ అందుకున్న ఆ బాలిక “అమ్మా, నేను పాసయ్యాను” అని చెప్పి ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ వెంటనే, పక్కనే ఉన్న థాన్ సింగ్‌ను గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసి థాన్ సింగ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పట్టుదలతో చదివి విజయం సాధించిన ఆ విద్యార్థినిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అది కేవలం పరీక్షలో పాసవ్వడం కాదని, ఆమె భవిష్యత్తుకు అది ఒక కీలక మలుపు అని నెటిజన్లు కామెంట్‌ చేసారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న థాన్ సింగ్‌ను కూడా అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

Follow Us