దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!
హైదరాబాద్‌లో దోమల బెడద ఎంత తీవ్రంగా ఉందో బండ్లగూడలోని ఓ సెక్యూరిటీ గార్డు వైరల్ వీడియో స్పష్టం చేసింది. దోమతెర ధరించి విధుల్లో ఉన్న ఈ గార్డు దుస్థితి ప్రజల సానుభూతిని చూరగొంది. ఇది ఆధునిక బానిసత్వమని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సొసైటీ యాజమాన్యాలు, ప్రభుత్వం దోమల నివారణకు, గార్డుల కనీస సౌకర్యాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో ఓ వైపు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని సూర్యుడు అస్తమించగానే దోమల మోత ఇబ్బంది పెడుతోంది. నగరంలో ఎటు చూసినా దోమల దండయాత్రే కనిపిస్తుంది. దోమలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బండ్లగూడ గేటెడ్ కమ్యూనిటీలో ఓ సెక్యూరిటీ గార్డు రాత్రి సమయంలో దోమల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా దోమ తెరను కప్పుకుని డ్యూటీ చేస్తున్నాడంటే.. దోమల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అతను కూర్చున్న చోటే దోమతెరను ధరించాడు. అక్కడే నివసిస్తున్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఇదేమని అడిగితే దోమల తీవ్రత చాలా ఉందని, వాటి నుంచి రక్షణకే దోమ తెరను కప్పుకొని డ్యూటీ చేస్తున్నానని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. అపార్ట్‌మెంట్‌లోని నివాసితులు ఏసీ గదుల్లో హాయిగా నిద్రిస్తుంటే, రాత్రంతా బయట విధులు నిర్వర్తించే గార్డుకు కనీసం సురక్షితమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎందుకు కల్పించలేరని నెటిజన్లు ప్రశ్నించారు. పేదల పట్ల ప్రజల్లో సానుభూతి, సున్నితత్వం తగ్గిపోవడమే అసలు సమస్య అని మరొకరు విమర్శించారు. సెక్యూరిటీ గార్డుల దుస్థితిపై నెట్టింట చర్చ జరుగుతోంది. “ఇది డ్యూటీ కాదు, ఆధునిక బానిసత్వం” అని ఒకరు కామెంట్ చేయగా, ” వీడియో నిజంగా హృదయాన్ని కలిచివేస్తోంది” అని మరొకరు రాసుకొచ్చారు. “ఈ గార్డుల బాధ్యత సొసైటీ యాజమాన్యానిదే, కానీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ దుస్థితిని చూసైనా స్పందించి దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు
రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్ చూసి షాక్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

