AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

Phani CH
|

Updated on: Apr 20, 2026 | 6:58 PM

Share

వివాహ బంధాలు బలహీనపడుతున్నాయని హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఘటన రుజువు చేస్తోంది. భర్త సరదాగా అన్న పెరుగు మాటను అవమానంగా భావించి, భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. చిన్న చిన్న అపార్థాలు, అహం దాంపత్యంలో దూరం పెంచుతున్నాయి. పరస్పర అవగాహన, మాటల స్పష్టత లోపించడం వల్ల కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సంఘటన సహనం, సరైన సంభాషణల ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది.

ఇటీవల కాలంలో వివాహబంధం బలం తగ్గిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు సహజం. ఒకరినొకరు అర్ధం చేసుకొని సందర్భాన్ని బట్టి ఒకరు తగ్గి మరొకరిని గెలిపించడంలోనే ఉంటుంది అసలైన అనుబంధం. కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గేదే లేదంటున్నారు. అందుకే మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలి పోతోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిధిలోని శంషిగూడలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. భర్త సరదాగా అన్న ఒక మాటకి, భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. శంషిగూడకు చెందిన శివకుమార్, రాజేశ్వరి దంపతులు అన్యోన్యమైన జంట. అయితే, తన భార్య రాజేశ్వరి సన్నగా ఉండటంతో, పెరుగు తింటే ఆరోగ్యం బావుంటుందని శివకుమార్ భార్యకు సలహా ఇచ్చాడు. అయితే, భర్త ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్న రాజేశ్వరి తన ఆరోగ్యం పట్ల భర్త చేసిన వ్యాఖ్యను అవమానంగా భావించి.. తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది రాజేశ్వరి. సాయంత్రం దాటినా భార్య తిరిగి రాకపోవడంతో కంగారుపడిన శివకుమార్, బంధువులు,స్నేహితుల ఇళ్లలో వాకబు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించాడు శివకుమార్‌. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన కుటుంబాల్లో మాటల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తోంది. చిన్న చిన్న విషయాలకు విపరీత అర్థాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో ఏర్పడే పరిస్థితులను సూచిస్తోంది ఈ ఘటన. తన భార్య క్షేమంగా తిరిగి రావాలని భర్త శివకుమార్ కోరుకుంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌

Follow Us