AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Silver Price Crash: యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు భయంతో తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించడాన్ని ఆర్థిక పరిభాషలో 'పానిక్ సెల్లింగ్' అంటారు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. యుద్ధం గనుక ముదిరితే..

Subhash Goud
|

Updated on: Apr 21, 2026 | 8:23 AM

Share
 Silver Price Crash: అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అటు బంగారం, ఇటు వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విలువైన లోహాల ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి ధర ఏకంగా లక్ష రూపాయలకు పడిపోయే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలైంది.

1 / 5
 పానిక్ సెల్లింగ్ అంటే ఏమిటి?: యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు భయంతో తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించడాన్ని ఆర్థిక పరిభాషలో 'పానిక్ సెల్లింగ్' అంటారు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. యుద్ధం గనుక ముదిరితే పారిశ్రామిక రంగం కుంటుపడుతుందనే భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామికంగా చాలా కీలకమైన లోహం.

2 / 5
 ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్: వీటి తయారీలో వెండి ముడిసరుకుగా వాడతారు. యుద్ధం వల్ల పరిశ్రమలు ఆగిపోతే వెండి వినియోగం తగ్గిపోతుంది. దీనివల్ల బడా ఇన్వెస్టర్లు వెండిని విక్రయించేందుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి.

3 / 5
 నిపుణులు ఏమంటున్నారు?: ప్రముఖ కమోడిటీ ఎక్స్‌పర్ట్ అజయ్ కేడియా (కేడియా అడ్వైజరీ) విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతానికి వెండి ధర కిలోకు రూ.1.75 లక్షల నుండి రూ.1.90 లక్షల మధ్య స్థిరపడవచ్చు. ఒకవేళ యుద్ధం ముదిరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే, ధర ఏకంగా లక్ష రూపాయల మార్కుకు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

4 / 5
 ఇన్వెస్టర్లకు సూచనలు: మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకమొత్తంలో పెట్టుబడి వద్దని సూచిస్తున్నారు. ధర తగ్గుతోంది కదా అని ఉన్న డబ్బు అంతా ఒకేసారి వెండిపై పెట్టకండి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనడం (SIP తరహాలో) సురక్షితం. అప్రమత్తత: చిన్న పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. 2026 చివరి నాటికి వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి).

5 / 5
Follow Us
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు

ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్

కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..

గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..

30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్

అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?

లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది

ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!

ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్

60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..