AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు.. ఎలా చెక్‌ చేసుకోవాలి? వీరికి మాత్రం రావు..!

Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం కన్నేసి ఉంచింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులగా తేలినట్లయితే వారిని పథకం నుంచి తొలగించనున్నారు..

Rythu Bharosa: రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు.. ఎలా చెక్‌ చేసుకోవాలి? వీరికి మాత్రం రావు..!
Telangana Rythu Bharosa Scheme
Subhash Goud
|

Updated on: Apr 21, 2026 | 10:13 AM

Share

Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధులను నిన్న విడుదల చేసింది. అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. అయితే మార్చిలో మొదటి విడత డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం. అది కూడా ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేయగా, ఇప్పుడు ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. అర్హులైన రైతులకు దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నంబర్లు మెసేజ్‌లు వస్తాయి. తద్వారా రైతులు తమ అకౌంట్లలో రైతు భరోసా నిధులు పడ్డాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా తమ అకౌంట్‌లలో నిధులు జమ అయ్యాయా? లేదా? అనేది తెలుసుకునే వీలు ఉంది. ఒకవేళ ఏదైనా సందేహలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందనుంది. ఇందుకోసం దాదాపు రూ.5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్‌‌‌‌ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

రైతు భరోసా రెండో విడత స్టేటస్ చెక్ చేసే విధానం:

  • అధికారిక వెబ్‌సైట్: తెలంగాణ రైతు భరోసా అధికారిక పోర్టల్ (https://rythubharosa.telangana.gov.in) సందర్శించండి.
  • లబ్ధిదారుల స్థితి (Beneficiary Status): హోమ్ పేజీలో ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • వివరాల నమోదు: మీ ఆధార్ నంబర్ (Aadhaar Number) లేదా పట్టాదారు పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయండి.
  • సమర్పించు (Submit): వివరాలను సమర్పించిన తర్వాత, మీ పేరు, చెల్లింపు వివరాలు (installment details), ఎన్ని డబ్బులు జమ అయ్యాయో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు?

ఈ రైతు భరోసా పథకానికి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి.

ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఈ పొరపాటు చేస్తే డబ్బులు రావు:

అయితే రైతు భరోసా విషయంలో అర్హతలు ఉండాల్సిందే. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా మీ పేరుపైనే భూమి ఉండాలి. తప్పుడు పత్రాలను సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే సాగుకు యోగ్యం కాని భూములు (బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు. ఇలాంటి భూమి ఉండి దరఖాస్తు చేసుకుంటే పథకం సాయం అందదని గుర్తించుకోండి. అయితే ఎవరైన అనర్హులుగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి డబ్బులు రావని గుర్తించుకోండి.

ప్రభుత్వం నిఘా:

రాష్ట్రంలో ఎవరైన అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం కన్నేసి ఉంచింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులగా తేలినట్లయితే వారిని పథకం నుంచి తొలగించనున్నారు.

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us