AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) అంటే ఏంటో తెలుసా.. మహిళల్లో ఆ సమస్యలు అందుకే వస్తాయట..

నిద్రలేమి మహిళల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ లేదా రుతుక్రమం సమయంలో తీవ్ర కడుపు నొప్పి సంభవించడం, క్రమరహితంగా రుతు క్రమం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయట. ఫలితంగా మహిళల్లో చిరాకు, నడుం నొప్పి వంటి అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్ సమయంలో..

Women Health: ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) అంటే ఏంటో తెలుసా.. మహిళల్లో ఆ సమస్యలు అందుకే వస్తాయట..
Pre Menstrual Syndrome
Srilakshmi C
|

Updated on: Sep 10, 2023 | 9:34 PM

Share

నిద్రలేమి మహిళల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ లేదా రుతుక్రమం సమయంలో తీవ్ర కడుపు నొప్పి సంభవించడం, క్రమరహితంగా రుతు క్రమం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయట. ఫలితంగా మహిళల్లో చిరాకు, నడుం నొప్పి వంటి అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్ సమయంలో మహిళలు తగినంత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం.. రాత్రి సమయంలో ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే స్త్రీలు అధిక రక్తస్రావం లేదా క్రమరహిత పీరియడ్స్‌ సమస్య ఎదుర్కోవలసి ఉంటుంది. ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయే ఆరోగ్యకరమైన మహిళలతో పోలిస్తే ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే స్త్రీలు 44 శాతం అధికంగా ఈ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని పరిశోధనలో తేలింది. ఇది పరిశోధనలో తేలింది

జర్నల్ ఆఫ్ స్లీప్ జర్నల్‌ ప్రకారం.. 24 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల 574 మంది మహిళలపై పీరియడ్ సైకిల్ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరి రెగ్యులర్ పీరియడ్స్ సమయంలో వారి మొత్తం రోజు ఎలా గడిచిందో తెలుసుకున్నారు. అధిక రక్తస్రావం, క్రమరహిత పీరియడ్స్‌తో బాధపడుతున్న మహిళలు రోజంతా అలసట, నిద్ర లేమి, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.

ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) అంటే ఏమిటి?

పీరియడ్స్ ప్రారంభమైన మొదటి కొన్ని రోజుల్లో అలసట, చిరాకు, కోపం వంటి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) అని అంటారు. టెన్షన్, ఆందోళన, మానసిక స్థితి సరిగాలేకపోవడం, నిద్రలేమి (నిద్రలేమి), మూడ్ స్వింగ్‌లు, చిరాకు, కోపం మొదలైనవి ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ ముఖ్య లక్షణాలు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి పెరుగుతుందని.. ఇది ప్రీ మెన్‌స్ట్రువల్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమయంలో మంచిగా నిద్ర పొందడానికి ఈ విధంగా చెయ్యండి..

స్లీపింగ్‌ షెడ్యూల్‌ తప్పకుండా పాటించాలి

రోజూ క్రమం తప్పకుండా స్లీపింగ్‌ షెడ్యూల్ పాటించాలి. పీరియడ్స్ సమయంలోనే కాకుండా ప్రతిరోజూ ఈ టైం టేబుల్‌ పాటించేలా చూసుకోవాలి. ప్రతిరోజూ అదే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

హీట్ థెరపీ

నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పి తీవ్రత అధికంగా ఉంటే హీట్ థెరపీ తీసుకోవచ్చు. నిద్రపోయే ముందు హీటింగ్ ప్యాడ్‌ని ఉపయోగించాలి. ఫలితంగా నొప్పి కొద్దిగా తగ్గుతుంది.. అప్పుడు సులువుగా నిద్ర వస్తుంది.

తేలికపాటి యోగాసనాలు వేయాలి

నిద్రపోయే ముందు స్ట్రేస్‌ తగ్గించడానికి శ్వాస సంబంధిత ఎక్సర్ సైజులు చేయాలి. కండరాలను రిలాక్స్ చేయడం, ధ్యానం, తేలికపాటి యోగా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే మంచి నిద్ర వస్తుంది.

తగినన్ని నీళ్లు తాగాలి

ఈ సమయంలో రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల అసౌకర్యాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించదు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.