AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health: మగాళ్లూ చలికాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. కాదంటారా మీ ఇష్టం ఇక.. !

సాధారణంగా, పురుషులతో పోలిస్తే మహిళలు తమ చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే, పురుషులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు.

Men Health: మగాళ్లూ చలికాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. కాదంటారా మీ ఇష్టం ఇక.. !
Men Beauty Tips
Shiva Prajapati
|

Updated on: Oct 28, 2022 | 3:53 PM

Share

సాధారణంగా, పురుషులతో పోలిస్తే మహిళలు తమ చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే, పురుషులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. చాలా మంది మగవారు తమ చర్మ సంరక్షణపై ఎలాంటి శ్రద్ధ వహించారు. ఈ కారణంగా.. పురుషుల చర్మం కాలక్రమేణా పొడిబారడం, నిస్తేజంగా మారడం జరుగుతంది. అలాగే, పురుషులు తమ రోజువారీ జీవనశైలిలో పునరావృతం చేసే కొన్ని సాధారణ తప్పుల కారణంగా కూడా చర్మం మరింత దెబ్బతింటుంది.

పురుషుల చర్మం మహిళ చర్మం కంటే కఠినంగా ఉంటుంది. అయితే, వారు చేసే కొన్ని పొరపాట్లు చర్మానికి హానీ కలిగిస్తాయి. రోజువారి జీవితంలో పురుషులు చేసే పొరపాట్లు ఏంటి? వాటి వలన కలిగే చర్మ సంబంధిత సమస్యలు ఏంటి? వాటిని ఎలా నివారించాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సబ్బును అతిగా ఉపయోగించొద్దు..

పురుషులు సబ్బును ఉపయోగించడం చాలా సాధారణ విషయం. కానీ, సబ్బులో ఉండే కఠినమైన రసాయనాలు చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. ఎక్కువగా సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ముఖ్యంగా ముఖంపై సబ్బుకు బదులుగా ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవాలి..

వేసవిలో, చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. ఆ పరిస్థితిలో మాయిశ్చరైజర్ అప్లై చేయడం ద్వారా చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ముఖం కడుక్కున్న తర్వాత మీ చర్మాన్ని బట్టి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తద్వారా చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి..

చాలా మంది ముఖాన్ని పట్టించుకుంటారు. కానీ పాదాల శుభ్రతను విస్మరిస్తారు. చెమట, ఇతర కారణాల వల్ల పాదాల చర్మం త్వరగా పాడవుతుంది. అందుకే పాదాలకు ఉపయోగించే సాక్సులను శుభ్రంగా ఉంచుకోవాలి. మంచిగా ఉతికిన వాటిని మాత్రమే వినియోగించాలి. అలాగే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.

సన్‌స్క్రీన్ వినియోగం..

సాధారణంగానే పురుషులు తమ చర్మ సంరక్షణను పట్టించుకోరు. అంత సమయం కూడా వారికి ఉండదనే చెప్పాలి. అయితే, సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం ద్వారా ముఖ చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు చర్మంపై సన్‌స్క్రీన్‌ అప్లై చేస్తే ప్రయోజనం ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే హానీకరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా, చర్మం దెబ్బతినకుండా నిరోధించవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు నిపుణుల సలహా మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..