AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooler: సమ్మర్‌ని కూల్‌గా చేసేయండి.. రూ. 8వేలకే రిమోట్‌ కంట్రోల్‌ కూలర్‌..

తక్కువ ధరలో ఇంటిని చల్లగా మార్చుకోవడంలో కూలర్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే తక్కువ ధరలో లభించే కూలర్స్‌లో సాధారణ ఫీచర్స్‌ ఉంటాయనే భావన మనందరిలో ఉంటుంది. అయితే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో తాజాగా ఓ కూలర్‌పై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్‌ కూలర్స్‌కు పెట్టింది...

Cooler: సమ్మర్‌ని కూల్‌గా చేసేయండి.. రూ. 8వేలకే రిమోట్‌ కంట్రోల్‌ కూలర్‌..
Air Cooler
Narender Vaitla
|

Updated on: Mar 05, 2024 | 7:07 PM

Share

అప్పుడే సమ్మర్‌ సెగ మొదలైంది. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రజలు ఈ సమ్మర్‌లో ఎండను తట్టుకోవడానికి ప్రత్యామ్నాయం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఎయిర్‌ కూలర్స్‌ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.

తక్కువ ధరలో ఇంటిని చల్లగా మార్చుకోవడంలో కూలర్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే తక్కువ ధరలో లభించే కూలర్స్‌లో సాధారణ ఫీచర్స్‌ ఉంటాయనే భావన మనందరిలో ఉంటుంది. అయితే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో తాజాగా ఓ కూలర్‌పై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్‌ కూలర్స్‌కు పెట్టింది పేరైన సింఫనీ కంపెనీపై ఈ ఆఫర్‌ లభిస్తోంది.

సింఫనీ డైట్‌ 3డీ 20ఐ పోర్టబుల్ టవర్‌ ఏయిర్‌ కూలర్‌ అసలు ధర రూ. 9వేలుగా ఉండగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,500కి సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. రూ. 8500 ధరలోనూ ఈ కూలర్‌లో రిమోట్‌ కంట్రోల్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. అంతేకాకుండా ఈ కూలర్ తక్కువ పవర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే ఇందులో 20 లీటర్ల నీటి స్టోరేజ్‌ను అందించారు. దీంతో ఈ కూలర్‌తో చల్లటి గాలిని సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ కూలర్‌ ద్వారా 13 మీటర్ల ఏరియా మొత్తం కవర్‌ అవుతుంది. ఇందులో అందించిన ఐప్యూర్‌ టెక్నాలజీతో మీకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఎయిర్‌ పొల్యుషన్‌ను అరికడుతుంది. మూడు సైడ్లు కూలింగ్‌ పాడ్స్‌తో రూపొందించిన ఈ కూలర్‌ను టచ్‌ స్క్రీన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో స్వింగ్ కంట్రోల్‌, టైమర్‌ సెట్టింగ్‌, కూలింగ్‌ కంట్రోల్‌తో పాటు నీరు అయిపోగానే చెప్పే ఆలారం వంటి ఫీచర్లను అందించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..