- Telugu News Photo Gallery Eating soaked raisins every day is good for health, check here is details in Telugu
Soaked Raisins: రోజూ నానబెట్టిన కిస్మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో..
డ్రై ఫ్రూట్స్‌లో కిస్మిస్‌లు కూడా ఒకటి. కానీ చాలా మందికి ఇవి అంటే ఇష్టం ఉండదు. ద్రాక్ష పళ్లను ఎండపెట్టి.. కిస్మిస్‌ల కింద చేస్తారు. ఎండు ద్రాక్ష చాలా రుచిగా ఉంటుంది. చాలా రకాల తీపి పదార్థాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. కిస్మస్‌లను నేరుగా తినే కంటే.. నానబెట్టి తీసుకుంటే మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష..
Updated on: Mar 05, 2024 | 6:56 PM

డ్రై ఫ్రూట్స్‌లో కిస్మిస్‌లు కూడా ఒకటి. కానీ చాలా మందికి ఇవి అంటే ఇష్టం ఉండదు. ద్రాక్ష పళ్లను ఎండపెట్టి.. కిస్మిస్‌ల కింద చేస్తారు. ఎండు ద్రాక్ష చాలా రుచిగా ఉంటుంది. చాలా రకాల తీపి పదార్థాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి.

కిస్మస్‌లను నేరుగా తినే కంటే.. నానబెట్టి తీసుకుంటే మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు రోజూ నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చెక్ పెట్టొచ్చు. ప్రేగుల్లో మలినాలు కూడా బయటకు వచ్చేసి.. కదలికలు మెరుగ్గా ఉంటాయి.

ఇవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. తక్షనమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. వీటిని తినడం గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీని కూడా అదుపులో ఉంచుతుంది.

కిస్మిస్‌లను తినడం వల్ల ఎముకలు అనేవి బలంగా, దృఢంగా మారుతాయి. అంతే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. మానసిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే ఎంతో మేలు.




