అల్లూరి జిల్లా ఏజెన్సీ అంటే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఎత్తైన కొండలు జాలువారే జలపాతాలకు తోడు.. లోతైన లోయలో ఇక్కడి స్పెషల్ ఎట్రాక్షన్. శీతాకాలంలో ఇక్కడి మంచు అందాలు కట్టిపడేస్తుంటాయి. ఇప్పటికే పాడేరు వంజంగి మేఘాలకొండ, అరకు లోయ మాడగడ వ్యూ పాయింట్ లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయా ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు చింతపల్లి ఏజెన్సీ లోని.. చెరువుల వేనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.