స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా వివో కంపెనీ వివో వీ 30 సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుంది. మార్చి 7న రిలీజ్ చేసే ఈ ఫోన్ వీ30, వీ 30 ప్రో అనే వేరియంట్స్‌లో లభ్యమవుతుంది. వీ 30 ధర రూ 30 వేలు, వీ 30 ప్రో రూ.40 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లు 6.78 అంగుళాల 1.5 కే ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఫన్ టచ్ ఓఎస్‌తో ఆండ్రాయిడ్ 14, డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే వీ 30 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 50 ఎంపీ పోర్ట్రెయిట్ సెన్సార్, జెసిస్ ఆప్టిక్స్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది.