- Telugu News Photo Gallery Technology photos Cyber criminals steal your data with USB Charging know about juice jacking Hacking
Cyber Crime: బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.? ఆర్బీఐ హెచ్చరిక
మారుతోన్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో డబ్బులు డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాల్లో ఛార్జింగ్ కేబుల్ ఒకటి. ఇదే విషయమై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మార్ట్ ఫోన్ యూజర్లను హెచ్చరించింది. ఇంతకీ ఏంటి మోసం.? సైబర్ నేరస్థులు డబ్బులు ఎలా కొట్టేస్తున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 04, 2024 | 10:24 PM

ప్రయాణాలు చేసే సమయంలో సాధారణంగా ఫోన్ ఛార్జింగ్‌ల కోసం బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్స్‌లో ఉండే ఛార్జింగ్ పాయింట్‌లను ఉపయోగిస్తుంటాం. అయితే దీనినే సైబర్ నేరస్థులు ఆసరాగా మార్చుకొని డబ్బులు కాజేస్తున్నారు.

పబ్లిక్ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్ల ద్వారా సైబర్ నేరస్థులు మీ ఫోన్‌లో మొత్తం డేటా దొంగలించే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. దీంతో బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇలా ఫోన్ ఛార్జింగ్ ద్వారా చేసే హ్యాకింగ్‌ను జ్యూస్ జాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇందుకోసం సైబర్ నేరస్థులు ఛార్జింగ్ పాయింట్ వద్ద ప్రత్యేక పరికరాన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దీంతో మీరు యూఎస్‌బీ కేబుల్‌ను ప్లగ్ చేయగానే మీ ఫోన్‌లోని డేటా మొత్తం ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

దీంతో మీ ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో పాటు బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలను సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. దీంతో మీ అకౌంట్‌లోని డబ్బు కాజేస్తున్నారు.

ఈ మోసం బారిన పడకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఉపయోగించకూడదు. తప్పని పరిస్థితుల్లో అయితే మీ ఛార్జర్‌తో నేరుగా అడాప్టర్‌తో ఛార్జ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నేరుగా యూఎస్‌బీ పోర్ట్‌తో ఛార్జ్ చేయకూడదు.




