- Telugu News Photo Gallery Technology photos Best 5 smart watch for kids, Check here for features and price details
Smart watch: మీ చిన్నారుల కోసం స్మార్ట్ వాచ్ కొంటున్నారా.? వీటిపై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్ వినియోగం అనివార్యంగా మారింది. కేవలం పెద్దలే కాకుండా చిన్నారులు కూడా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో కంపెనీలు కూడా అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లను తీసుకొస్తున్నాయి. మరి చిన్నారులకు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 05, 2024 | 10:06 PM

Ticktalk 4: చిన్నారుల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో టిక్‌టాక్4 వాచ్ ఒకటి. ఈ స్మార్ట్ వాచ్లో జీపీఎస్ ట్రాకర్, కంబైన్స్ వీడియో, వాయిస్ అండ్ వైఫై కాలింగ్, మెసేజింగ్ వంటి ఫీచర్లను అందించారు. స్టే సేఫ్, స్టే ఎంగేజ్‌డ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందించారు.

MOVCTON M1: ఈ వాచ్‌ను చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు. రూ. 500లో అందుబాటులో ఉన్న ఈ వాచ్‌లో మంచి ఫీచర్లను అందించారు. 1.33 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇందులో అందించారు. ఇందులో హార్ట్‌రేట్, బ్లడ్ ప్రెజర్ వంటి ఫీచర్లను అందించారు.

Gabb watch 3: చిన్నారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్లో జీపీఎస్ ట్రాకింగ్, కస్టమైజబుల్ సేఫ్ జోన్స్, ఎస్‌ఓఎస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్, పేరెంట్ మ్యానేజ్డ్ కాంటాక్ట్స్ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు చిన్నారుల రక్షణ కోసం పలు ఫీచర్లను అందించారు.

Fitbit Ace3: చిన్నారులకు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో ఫిట్‌బిట్ ఏస్3 ఒకటి. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఈ వాచ్‌ను పేరెంట్స్ తమ స్మార్ట్ ఫోన్‌తో కంట్రోల్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఇందులో హెల్తీ ఫీచర్లు కూడా అందించారు.

Angel Watch: చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. జీపీఎస్ ట్రాకింగ్, స్టే ఇన్ టచ్ సేఫ్లీ, ఆడియో అండ్ వీడియో మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.




