- Telugu News Photo Gallery Technology photos Vivo offering disscount on Vivo V29e smart phone, Check here for full details
Vivo V29e: వివో స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్.. తక్కువ ధరలో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే..
కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో విడుదల చేసిన ఫోన్‌ల ధరలపై డిస్కౌంట్‌లను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మంచి ఆఫర్‌ను ప్రటించింది. వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది...
Updated on: Mar 05, 2024 | 10:20 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియాలో తన Vivo V29e స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను వివో గతేడాది ఆగస్టులో విడుదల చేసింది. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ రూ. 1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999 కాగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందించారు. 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. 2400 x 1080 పిక్సెల్ ఈ డిస్‌ప్లే సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసరత్‌తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 5G, 4G, Wi-Fi 802.11 b/g/n/ac, బ్లూటూత్ v5.1, GPS, USB టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు




