- Telugu News Photo Gallery Do you know why the bell rings in the temple? check here is details in Telugu
Interesting Facts: గుడిలో అసలు గంట ఎందుకు కొడతారో తెలుసా.. దీని అర్థం ఇదే!
చాలా మందికి గుడికి వెళ్లడం అలవాటు. ఉదయం లేదా సాయంత్రం అయినా వెళ్లి ొక్కసారి గుడిని దర్శించి వస్తారు. అయితే గుడికి సంబంధించి ఎన్నో నియమాలు, విషయాలు ఉంటాయి. ఏ గుడిలో అయినా ఖచ్చితంగా గంట అనేది ఉండటం కామన్ విషయం. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ గంటను మోగిస్తూనే ఉంటారు. చిన్న పిల్లలతో సైతం కొట్టిస్తూ ఉంటారు. ఈ గంట కొట్టేటప్పుడల్లా మీకు ఓ విషయం మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు గంట ఎందుకు కొడతారో..
Updated on: Mar 05, 2024 | 5:49 PM

చాలా మందికి గుడికి వెళ్లడం అలవాటు. ఉదయం లేదా సాయంత్రం అయినా వెళ్లి ఒక్కసారి గుడిని దర్శించి వస్తారు. అయితే గుడికి సంబంధించి ఎన్నో నియమాలు, విషయాలు ఉంటాయి. ఏ గుడిలో అయినా ఖచ్చితంగా గంట అనేది ఉండటం కామన్ విషయం. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ గంటను మోగిస్తూనే ఉంటారు.

చిన్న పిల్లలతో సైతం కొట్టిస్తూ ఉంటారు. ఈ గంట కొట్టేటప్పుడల్లా మీకు ఓ విషయం మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు గంట ఎందుకు కొడతారో.. చాలా మందికి తెలీదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో.. శరీరంలోని అన్ని రకాల ప్రతి కూల శక్తులు తొలగిపోతాయని హిందూ మత పెద్దలు చెబుతూ ఉంటారు. గంట కొట్టినప్పుడు శరీరంలో ఉండే అన్ని ప్రతి కూల శక్తులు తొలగిపోతాయని అంటారు.

అంతే కాకుండా గుడిలోకి వచ్చిన తర్వాత ఏకాగ్రత అంతా దేవుడి మీద ఉండేందుకు కూడా గంట కొట్టాలని అంటారు. గంట కొట్టడం వల్ల చుట్టు ప్రక్కల వాతావరణం కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

ముఖ్యంగా గంట కొట్టినప్పుడు దీని నుంచి ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఓంకారం అనేది సృష్టి ప్రారంభం అయినప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం. ఓంకారం పఠించడం వల్ల ఎంతో పుణ్యం.




