AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iodine Deficiency: గర్భిణీల్లో అయోడిన్‌ లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పుట్టబోయే పిల్లలకు ఆ సమస్యలు..

ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్ లలో అయోడిన్ ఒకటి. ఇది లోపిస్తే భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించాలంటే కనీస మోతాదులో అయోడిన్ కలిగిన ఉప్పును తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమయంలో అయోడిన్ సరిపడా తీసుకోవాలి. లేదంటే పిల్లలపై ప్రతికూల ప్రభావాలు పడుతాయి..

Iodine Deficiency: గర్భిణీల్లో అయోడిన్‌ లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పుట్టబోయే పిల్లలకు ఆ సమస్యలు..
Iodine Deficiency
Srilakshmi C
|

Updated on: Oct 22, 2024 | 8:27 PM

Share

తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే దానిని అస్సలు తినలేం. అలాగని తక్కువగా ఉంటే వంట రుచి బాగోదు. ఉప్పు రుచికి మాత్రమే కాదు, శరీరానికి కూడా ఇందులోని అయోడిన్ కంటెంట్ అవసరం. మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన సూక్ష్మపోషకం, థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరును నిర్ణయించేది, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ చాలా అవసరం. అందుకే అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు యువతలో నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రస్తుత ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మంది అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల బారిన పడుతున్నారు. అయోడిన్ ఆరోగ్య ప్రయోజనాలు, దాని లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి ఎన్నో యేళ్లుగా అనేక అవగాహన ప్రచారాలు నిర్వహించబడుతున్నప్పటికీ, ప్రపంచంలోని 54 దేశాలలో అయోడిన్ లోపం ఇప్పటికీ ఉంది. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు, ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ ఉప్పు అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ప్రపంచ అయోడిన్ లోపం దినోత్సవాన్ని జరుపుకుంటారు.

శరీరంలో అయోడిన్ లోపం – లక్షణాలు

మీ శరీరంలో అయోడిన్ లోపిస్తే, మీరు బరువు పెరగవచ్చు. విపరీతమైన చలి, చర్మం పొడిబారడం, జుట్టు ఎక్కువగా రాలడం, గుండె వేగం మందగించడం, మతిమరుపు, గొంతు నొప్పి, వాపు, అధిక నిద్ర, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ ఆహారంలో అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల శరీరంలో అయోడిన్ లోపాన్ని నివారించవచ్చు.

శరీరంలో అయోడిన్ లోపం – వ్యాధులు

శరీరంలో అయోడిన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. వీటిలో అయోడిన్ లోపం సిండ్రోమ్ ఒకటి. గర్భిణీలలో అయోడిన్ లోపం వల్ల పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. గర్భిణీలలో అయోడిన్ లోపం తలెత్తితే గర్భస్రావం, వికలాంగ శిశువు, నవజాత శిశువులు, పిల్లలలో మరుగుజ్జు, చెవుడు, అంధత్వం, మానసిక సమస్యలు, చెవుడు, లైంగిక అభివృద్ధి లేకపోవడం, నత్తిగా మాట్లాడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతే కాకుండా గొంతు బొంగురుపోవడం, శరీరంపై కురుపులు, కొలెస్ట్రాల్ పెరగడం, చురుకుదనం కోల్పోవడం, నీరసంగా ఉండడం, ఊబకాయం, లైంగిక ఉదాసీనత వంటి ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. ఈ రకమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో అయోడైజ్డ్ ఉప్పును తీసుకోవడం.

ఇవి కూడా చదవండి

శరీరానికి ఎంత అయోడిన్ అవసరం?

శరీరానికి అవసరమైన అయోడిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు కేవలం 150 మైక్రోగ్రాములు తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకు కేవలం 50 మైక్రోగ్రాములు, గర్భిణీలకు 200 మైక్రోగ్రాముల అయోడిన్ సరిపోతుంది. మొత్తంమీద, ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25 మిల్లీగ్రాముల అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే

బంగాళదుంపలను వాటి తొక్కలతో తినడం వల్ల శరీరానికి అవసరమైన అయోడిన్ అందుతుంది. ఈ తొక్కలో అయోడిన్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలు, ఎండుద్రాక్ష, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ధాన్యం-బీన్స్, ఆకుకూరలు-పాలక్, మిల్లెట్, ఆవాలు, మొక్కజొన్న, వేరుశెనగలు తినడం ద్వారా శరీరంలో అయోడిన్ లోపాన్ని అధిగమించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.