AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా.. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిన ఉండవచ్చు..

రక్త పరీక్ష మాత్రమే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తెలియజేస్తుంది. అయితే యూరిక్ లెవెల్ స్థాయిని అర్థం చేసుకోవడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం కాదు. అందుకు బదులుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువ లేదా తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తాయి. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించాలని కోరుకుంటాయి.

Uric Acid: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా.. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిన ఉండవచ్చు..
హై బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలో టాక్సిన్స్ స్థాయి కూడా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్‌ శరీరంలోని ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. రక్తంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉంటే అనతి కాలంలోనే మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయి. వాటి పనితీరును దెబ్బతీస్తుంది.
Surya Kala
|

Updated on: Oct 05, 2024 | 8:50 PM

Share

ప్రస్తుతం ఈ యూరిక్ యాసిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడానికి కారణాలు కావచ్చుయూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలలో ఒకటి కీళ్ల నొప్పులు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నారో లేదో అర్థం చేసుకోవడానికి.. వైద్యులు వివిధ లక్షణాల కోసం రక్త పరీక్షలను సూచిస్తారు. రక్త పరీక్ష మాత్రమే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తెలియజేస్తుంది. అయితే యూరిక్ లెవెల్ స్థాయిని అర్థం చేసుకోవడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం కాదు. అందుకు బదులుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువ లేదా తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తాయి. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించాలని కోరుకుంటాయి. అయితే యూరిన్ అధికంగా రావడంతో పాటు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే మూత్రంతో పాటు రక్తస్రావం కూడా కావచ్చు. అలాగే UTI లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. యూరిక్ యాసిడ్ సమస్య పెరిగినప్పుడు చాలా మందికి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. ఎవరికైనా ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. అది వీపు కింద, పొట్ట దిగువ భాగంలో లేదా గజ్జల్లో నొప్పి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి

రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాలలో తీవ్రమైన నొప్పి ఉన్నా.. తేలికపాటి మంటగా అనిపించినా జాగ్రత్తగా ఉండటం అవసరం. పాదాల నొప్పి రాత్రి సమయంలో నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ కి సంకేతం కావచ్చు.

అంతేకాదు చర్మం గరుకుగా ఉండటం.. ఎప్పుడూ అలసటగా అనిపించినా, వికారం, తరచుగా వాంతులు, తరచుగా కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించినా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిన లక్షణాలు కావచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.