Piles: పైల్స్‌తో నరకం చూస్తున్నారా.? ఇలా చేస్తే వారం రోజుల్లోనే రిజల్ట్..
పైల్స్ బారిన పడితే నొప్పితో నరకం అనుభవించే పరిస్థితి ఉంటుంది. జీర్ణక్రియ మందగించడం కారణంగా చాలా మంది పైల్స్ సమస్య వెంటాడుతుంది. మలంలో రక్తం రావడం వంటి తీవ్ర సమస్యలకు ఇది దారి తీస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఒక్కసారిగా బరువు తగ్గుతారు. తీవ్రమైన ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం...
మారిన విధానం, ఒత్తిడితో కూడుకున్న జీవితం. మారిన ఆహారపు అలవాట్లు కారణం ఏదైనా ఇటీవల పైల్స్ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు పైల్స్‌కు దారి తీస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల పైల్స్ సమస్య వస్తుంది.
పైల్స్ బారిన పడితే నొప్పితో నరకం అనుభవించే పరిస్థితి ఉంటుంది. జీర్ణక్రియ మందగించడం కారణంగా చాలా మంది పైల్స్ సమస్య వెంటాడుతుంది. మలంలో రక్తం రావడం వంటి తీవ్ర సమస్యలకు ఇది దారి తీస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఒక్కసారిగా బరువు తగ్గుతారు. తీవ్రమైన ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల కేవలం వారం రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైల్స్‌తో బాధపడేవారు అలోవెరాను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా గుజ్జును తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య దూరమవుతుందని అంటున్నారు. అలోవెరాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కలబంద జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజు 200 నుంచి 250 గ్రాముల కలబంద గుజ్జు తింటే పైల్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది క్రమంగా పైల్స్ సమస్యను దూరం చేస్తుంది. జీలకర్ర కూడా పైల్స్‌ను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. జీలకర్రను వేయించి, అందులో చక్కెర కలుపుకొని తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మెంతి కూరను గ్రైండ్ చేసిన అందులో చక్కెర కలుపుకొని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఇక జీలకర్రను మజ్జిగతో కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లో ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి కూడా పైల్స్‌ను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. రోజూ క్రమంతప్పకుండా బొప్పాయి తీసుకుంటే.. దీర్ఘకాలిక మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. బొప్పాయిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. పైల్స్ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..