AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మిస్టెక్స్ చేయకండి.. బాదం తినడానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆరోగ్యాన్ని కాపాడుకేందుకు డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.. అలాంటి సూపర్‌ఫుడ్ లో బాదం ఒకటి.. బాదాన్ని రెగ్యులర్ గా తింటే శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. అయితే ఇందుకోసం బాదంపప్పును సరైన పద్ధతిలో సరైన సమయంలో తినడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు..

ఈ మిస్టెక్స్ చేయకండి.. బాదం తినడానికి సరైన సమయం ఏంటో తెలుసా..?
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. Image Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2024 | 7:33 PM

Share

ఆరోగ్యాన్ని కాపాడుకేందుకు డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.. అలాంటి సూపర్‌ఫుడ్ లో బాదం ఒకటి.. బాదాన్ని రెగ్యులర్ గా తింటే శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. అయితే ఇందుకోసం బాదంపప్పును సరైన పద్ధతిలో సరైన సమయంలో తినడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.. బాదం పప్పులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే బాదం పప్పును అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు.

బాదంను సాధారణంగా స్వీట్లు, డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. ఇదికాకుండా బాదంను పచ్చిగా, కాల్చిన లేదా నానబెట్టి తినవచ్చు. బాదంపప్పును తింటే ఎన్నో లాభాలు ఉన్నా.. సరైన సమయంలో తింటేనే శరీరానికి పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు డైటీషియన్లు..

బాదం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె జబ్బుల నివారణ: బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరం. దీని రెగ్యులర్ వినియోగం చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రధానంగా గుండె జబ్బులకు కారణమవుతుంది.

బరువు తగ్గుతుంది: బాదంపప్పులో అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. దీని కారణంగా ఆకలి నియంత్రణ చాలా కాలం పాటు సులభంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గించే ఆహారంలో బాదంను చేర్చడం వల్ల అతిగా తినడాన్ని అరికట్టడంతోపాటు.. ఊబకాయం పెరగదు. బరువు నియంత్రణలో ఉంటుంది.

చర్మానికి ప్రయోజనకరం: బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఇతర పోషకాలు మెరిసే చర్మం కోసం సహాయపడతాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.

జ్ఞాపకశక్తి బూస్టర్: బాదం మెదడుకు మంచి ఆహారంగా పరిగణిస్తారు. వీటిలో ఉండే రిబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ మెదడు అభివృద్ధి.. పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.

బలహీనత దూరమవుతుంది: బాదంపప్పులో జింక్, మెగ్నీషియం, విటమిన్ బి2 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వ్యాయామం తర్వాత లేదా ఎక్కువసేపు పనిచేసేటప్పుడు బాదంపప్పును తీసుకోవడం ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

బాదం తినడానికి సరైన మార్గం ఇదే..

బాదం పప్పు తినడానికి ఉదయం ఉత్తమ సమయంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం నీరు త్రాగిన తర్వాత, 3-4 బాదంపప్పులను నీటిలో లేదా పాలలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలోని అన్ని పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)