AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: తొక్కలోది తొక్కే అంటూ పండ్లు, కూరగాయల తొక్కలను పడేస్తున్నారా..! ఎన్ని ఉపయోగాలో తెలుసా

పండ్లు , కూరగాయలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. వీటిని వినియోగించిన తర్వాత తొక్కలను తీసి చెత్తబుట్టలో వేస్తారు. అయితే ఈ తొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా..! పండ్లు, కూరగాయల తొక్కలను పడేయకుండా ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం..

Kitchen Hacks: తొక్కలోది తొక్కే అంటూ పండ్లు, కూరగాయల తొక్కలను పడేస్తున్నారా..! ఎన్ని ఉపయోగాలో తెలుసా
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Dec 11, 2024 | 8:38 PM

Share

మనం వండేటప్పుడు సాధారణంగా కూరగాయలను తొక్క తీసి వాడతాం. కొన్ని పండ్లను తినేటప్పుడు తొక్కలు తీసి వాటిని తింటాం. అయితే కూరగాయలు, పండ్ల తొక్కలు పండ్ల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఇది వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఈ తొక్కల ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత.. వాటిని వ్యర్థంగా విసిరివేయలేరు.

బంగాళదుంప తొక్క: బంగాళదుంపలను వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు. అయితే బంగాళాదుంప తొక్కలను పనికిరానివిగా విసిరివేస్తాము. ఇందులో విటమిన్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బంగాళాదుంప తొక్కను 10 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టి.. అది చల్లబడిన తర్వాత కళ్ల చుట్టూ అప్లై చేయండి. ఈ తొక్కను పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి.. తర్వాత చల్లని నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేయడం వల్ల కళ్ల నొప్పులు, కంటి చుట్టూ నల్లటి వలయాలు వంటి సమస్యలు తొలగిపోతాయి.

కమలాఫలం తొక్క: స్వీట్ ఆరెంజ్ తొక్కలో కూడా వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తొక్క లోపలి భాగంతో దంతాలను స్క్రబ్ చేయడం వల్ల పసుపుపచ్చ దంతాలు తెల్లగా మెరుస్తాయి. పంటి ఎనామిల్‌కు మంచిది. అంతే కాదు నారింజ తొక్క సహజసిద్ధమైన క్రిమి సంహారిణి కావడంతో దాని వాసనకు క్రిములు కూడా రావు.

ఇవి కూడా చదవండి

యాపిల్ పీల్: యాపిల్ తొక్కలో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా , తేమగా ఉంచుతుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. యాపిల్ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల వంటి సమస్యలు కూడా నయమవుతాయి.

దోసకాయ తొక్క: దోసకాయ తొక్కను ముఖానికి రాసుకోవడం వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది. అలాగే శుభ్రపరిచే సమయంలో శరీరంలోని విష రసాయనాలను తొలగించడానికి దోసకాయ గుజ్జును ఉపయోగించవచ్చు.

అరటిపండు తొక్క: అరటిపండు తిని తొక్కను విసిరేసే బదులు.. ఈ తొక్కలను షూలను పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని బూట్లపై రుద్దడం వల్ల బూట్లపై ఉన్న మురికి, దుమ్ము శుభ్రపడి బూట్లు అద్దంలా మెరుస్తాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)