AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Addiction: మీ పిల్లలు మొబైల్ పోన్‌ని వదలడం లేదా.. ఈ చిట్కాలతో అలవాటుని వదిలించండి..

కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించినట్లు నేటి జనరేషన్ పిల్లలు సెల్ ఫోన్ తో పుడుతున్నారు. అమ్మ ఆకలి అనడం మానేసి సెల్ ఫోన్ అని అంటున్నారు. మొబైల్ ఫోన్ ప్రాణంలో ఒక భాగంగా మారిపోయింది. పెద్దలు మాత్రమే కాదు చిన్న చిన్న పిల్లలు సైతం మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇలా రోజంతా పిల్లలు మొబైల్ ఫోన్ చూస్తుంటే వారి దృష్టి బలహీనపడటమే కాదు మెదడు కూడా సరిగ్గా అభివృద్ధి చెందదు. కనుక ఈ రోజు పిల్లలకు సెల్ ఫోన్ అలవాటుని ఎలా వదిలించాలంటే..

Mobile Addiction: మీ పిల్లలు మొబైల్ పోన్‌ని వదలడం లేదా.. ఈ చిట్కాలతో అలవాటుని వదిలించండి..
Child Mobile Addiction
Surya Kala
|

Updated on: May 30, 2025 | 8:55 PM

Share

ప్రస్తుతం పిల్లలు మొబైల్ లేకుండా ఆహారం కూడా తినరు. మీరు వారి మొబైల్ ఫోన్ లాక్కుంటే ఏడవడం ప్రారంభిస్తారు. దీని వ్యసనం ఎంతగా పెరిగిందంటే పిల్లలు శారీరక శ్రమకు దూరమై చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు వారు మొబైల్‌లో చిన్న పిల్లలు చూడకూడని విషయాలను చూడటం కూడా జరుగుతుంది. అప్పుడు శారీరక , మానసిక ఆరోగ్యాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది. మొబైల్ వ్యసనం కారణంగా కొంతమంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. చిరాకు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు చాలా చిన్న వయసులోనే మొదలవుతాయి. తరచుగా పిల్లలను ఫోన్ వ్యసనం నుంచి బయటకు రావాలనే ఉద్దేశ్యంతో తచుగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని తిడతారు లేదా కొడతారు. అయితే ఈ పద్ధతి పూర్తిగా తప్పు.

పిల్లల డిమాండ్లు నెరవేరినప్పుడు మొండిగా మారతారు. తాము పట్టుబడితే.. తమ డిమాండ్లు నెరవేరుతాయని పిల్లలకు తెలుసు. అందుకే పిల్లలు ఫోన్ అడిగినప్పుడు.. వెంటనే ఇస్తారు. దీని కారణంగా మొబైల్ వాడటం పిల్లల జీవనశైలిలో ఒక భాగమైపోతుంది. నెమ్మది నెమ్మదిగా ఈ అలవాటు మొబైల్ వాడడంలో వ్యసనంగా ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. కనుక పిల్లలను మొబైల్ వ్యసనం నుంచి ఎలా బయటపడేయాలో తెలుసుకుందాం.

పిల్లల ఫోన్ వ్యసనం వదిలించుకోవడానికి సులభమైన మార్గాలు

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. పిల్లలు చిన్నతనం నుంచే తన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం ద్వారా విషయాలు నేర్చుకుంటాడు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు రోజంతా ఫోన్‌లో బిజీగా ఉంటే.. పిల్లల్లో కూడా ఉత్సుకత పెరుగుతుంది. తాను కూడా ఫోన్ ఉపయోగించాలని భావిస్తాడు.

పిల్లలకు ఇలా వివరించండి పిల్లలు ఫోన్ అలవాటు మానేయాలనుకుంటే.. ఫోన్ వాడటం వలన ఎలా ఆరోగ్యానికి హానికరమో ప్రేమగా వివరించండి. ఈ అలవాటు వలన పిల్లలు భవిష్యత్ లో ఎదుర్కోవాల్సిన సమస్యలను గురించి వివరించండి. అంతేకాని పిల్లలని ఇది చేయవద్దు అంటూ.. తిట్టడం లేదా కొట్టడం చేస్తే.. అప్పుడు పిల్లలు మరింత మొండిగా మారి అదే పనులు మళ్లీ మళ్లీ చేస్తాడు.

నచ్చిన పనులు చెప్పండి పిల్లలు అడుగుతున్నాడని ఫోన్ ఇచ్చే బదులు.. వారితో ఆడుకోండి. పిల్లలు కొత్త సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేలా చేయండి. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, యోగా, ఆటలు వంటివి. ఇవి మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవడంలో సహాయపడటమే కాదు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక కూడా.

ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకోండి పిల్లలు రోజంతా చేసే ప్రతి పనికి సమయాన్ని నిర్ణయించుకోండి. ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు సమయాన్ని నిర్ణయించుకోండి. దీనితో పిల్లలు రోజుని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుంటారు. ఈ టైమ్ టేబుల్ లో పిల్లల నిద్ర, భోజనం, ఆటలు, చదువుల సమయాన్ని నిర్ణయించండి. దీని తరువాత వారికి రోజుకు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఫోన్ ఇవ్వండి.

పిల్లల దగ్గర ఫోన్ ఉంచవద్దు. పిల్లల దగ్గర ఫోన్ ఉంచవద్దు. ఫోన్ ఉపయోగించడానికి టెంప్ట్ అవ్వకుండా ఫోన్‌ను వారి దృష్టి నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. రాత్రి సమయంలో ఫోన్‌ను పిల్లలకు దగ్గరగా ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. పిల్లలు ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి. ఫోన్‌ పిల్లలకు అందకుండా దూరంగా పెట్టండి. తద్వారా పిల్లలు దానిని అందుకోలేరు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)