AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: విద్యార్ధికి తీవ్రమైన కడుపు నొప్పి, ఆగని వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో డాక్టర్లకు

పిల్లలు తినకూడని కొన్ని వస్తువులను తింటుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక మానసిక సమస్య. ఈ అలవాటు వయసుతో సంబంధం లేదు.. కొంతమంది తినకూడని తినడం అలవాటు చేసుకుంటాడు. అటువంటి తిన్న తర్వాత కడుపులోకి ప్రవేశించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటువంటి సమస్యతో బాధపడుతున్న 10వ తరగతి విద్యార్థి కడుపు నుంచి పెద్ద వెంట్రుకల బంతిని తొలగించారు వైద్యులు. ప్రపంచంలో ఇదే అత్యంత పొడవైన ట్రైకోబెజోవర్ అని వైద్యులు చెప్పారు.

Viral News: విద్యార్ధికి తీవ్రమైన కడుపు నొప్పి, ఆగని వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో డాక్టర్లకు
Viral News
Surya Kala
|

Updated on: May 30, 2025 | 6:40 PM

Share

మీ పిల్లలు కూడా మట్టి, సుద్ద, దారం, చెక్క ముక్కలను నమలడం లేదా తింటే జాగ్రత్తగా ఉండండి. జైపూర్‌లోని 10వ తరగతి విద్యార్థి కడుపు నుంచి 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకో బెజోవర్ (కడుపులో ఇరుక్కుపోయిన వెంట్రుకల బంతి)ను వైద్యులు తొలగించారు. కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. వెంటనే వైద్యులు విద్యార్థికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ షాకింగ్ కేసు జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. స్టూడెంట్ కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతుంటే.. కుటుంబ సభ్యులు ఆ విద్యార్థికి అనేక చోట్ల చికిత్స ఇప్పించారు. చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఉపశమనం లభించింది. మళ్ళీ సమస్య మళ్ళీ మొదలైంది. దీంతో ఆ విద్యార్థిని కుటుంబానికి తెలిసిన ఒకరు సవాయి మాన్సింగ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని చెప్పారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత విద్యార్థిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆ విద్యార్థిని కడుపులో ఒక ముద్ద ఉంది. అది బొడ్డు చుట్టూ వ్యాపించింది. తర్వాత మరిన్ని పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స చేయాలనీ డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఆపరేషన్ రెండు గంటలు కొనసాగింది

ఆ విద్యార్థినికి చేసిన CE CT స్కాన్ లో స్టూడెంట్ కడుపు ఉబ్బిందని .. దాని లోపల ఏదో అసాధారణ వస్తువు ఉందని వెల్లడైంది. ఆ తర్వాత వైద్యులు వెంటనే లాపరోటమీ సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థికి దాదాపు 2 గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఆ విద్యార్థికి రక్త మార్పిడి అవసరం ఉండదు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఆశ్చర్యపోయారు.

గ్యాస్ట్రోస్టమీ సమయంలో.. విద్యార్థి కడుపులోని ట్రైకోబెజోవర్ కేవలం కడుపుకే పరిమితం కాలేదు ఆ జుట్టు చిన్న ప్రేగులకు వ్యాపించిందని వైద్యులు గమనించారు. శస్త్రచికిత్స సమయంలో ఆ జుట్టు ఉండని ఒకే ముక్కగా బయటకు తీయడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే అది కట్ అయితే దానిని తొలగించడానికి ప్రేగులను కట్ చేయాల్సి ఉండేది. రెండు గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసిన వైద్యులు.. వెంట్రుకల ఉండ ఎక్కడా కట్ అవ్వకుండా తొలగించడంలో విజయం సాధించారు.

ఆపరేషన్ బృందం

విద్యార్థికి శస్త్రచికిత్స జరిగిన సమయంలో.. డాక్టర్ కంకారియా బృందంలో డాక్టర్ రాజేంద్ర బుగాలియా, డాక్టర్ దేవేంద్ర సైని, డాక్టర్ అమిత్, డాక్టర్ సునీల్ చౌహాన్ లతో పాటు వారి అనస్థీషియా బృందం కూడా ఉంది. ఈ ఆపరేషన్‌లో సహాయక సిబ్బంది షయీర్, జుగన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని..ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని తెలిపారు.

మానసిక సమస్య తో బాధపడుతున్న స్టూడెంట్

విద్యార్థికి శస్త్రచికిత్స చేసిన సర్జన్ డాక్టర్ జీవన్ కంకారియా మాట్లాడుతూ.. విద్యార్థి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు. ఈ సమస్య వలన అతను కనిపించిన ప్రతిదీ తినడం మొదలు పెట్టాడు. బంకమట్టి, సుద్ద ముక్క, దారం , చెక్క ముక్కలు, జుట్టు ఇలా ఏది కనిపిస్తే అది తినేసేవాడు. ఇవన్నీ అతని కడుపులో పేరుకుపోతున్నాయి. క్రమంగా దారం, జుట్టు.. ఇతర వస్తువులు ముడి రూపాన్ని తీసుకున్నాయి. ఆ తరువాత స్టూడెంట్ కి కడుపు ఉబ్బరం ప్రారంభమైంది. కడుపులో నొప్పితో పాటు, వాంతుల సమస్య మొదలైందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్