AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెబ్బకు తిక్క కుదిరింది.. ప్రమాదమని తెలిసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న పోలీసులు!

రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. చట్టం ఎంత చెప్పినా.. తరచుగా డ్రైవర్లు, రైడర్లు ఏమాత్రం పట్టించుకోరు. నిత్యం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఏకంగా ట్రాఫిక్ పోలీసులే రాంగ్‌రూట్‌లో మహీంద్రా బొలెరో కారుతో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

దెబ్బకు తిక్క కుదిరింది.. ప్రమాదమని తెలిసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న పోలీసులు!
Tnrtc Bus Police Vehicle Accident
Balaraju Goud
|

Updated on: May 30, 2025 | 7:42 PM

Share

రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. చట్టం ఎంత చెప్పినా.. తరచుగా డ్రైవర్లు, రైడర్లు ఏమాత్రం పట్టించుకోరు. నిత్యం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఏకంగా ట్రాఫిక్ పోలీసులే రాంగ్‌రూట్‌లో మహీంద్రా బొలెరో కారుతో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వన్-వేలో తప్పు అని తెలిసి కూడా అటు వైపు నడుపుతూ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.

ఈ సంఘటన తమిళనాడులో జరిగినట్లు కనిపిస్తోంది. కొందరు ఇది చెన్నైకి ఉత్తరాన, బహుశా తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రహదారిలో జరిగినట్లు భావిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియోలో, ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీసుల వన్-వే రోడ్డులో తప్పు వైపుగా వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించినప్పటికీ, బొలెరో ట్రాఫిక్‌కు ఎదురుగా వెళుతూనే ఉంది. అది ఏకంగా తమిళాడు ఆర్టీసీ బస్సును ఢీకొట్టే వరకు..!

TNRTC బస్సు, తన రూట్లో సరిగ్గా వస్తుంది. అయినప్పటికీ బోలెరో వాహనం ఎదురుగా దూసుకుపోతూనే ఉంది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఆలస్యంగా బ్రేక్ వేసి SUVని ఢీకొట్టాడు. ఇదంతా చూస్తుంటే, బస్సు డ్రైవర్ తప్పు చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బ్రేక్ వేసి ఉండవచ్చని ఈ వీడియోలో స్పష్టమవుతోంది. బొలెరో వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతూ నడిపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీన్నంతటిని సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఓ యువకుడు తన సెల్‌ఫోన్ రికార్డ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చెంది.

బస్సు వేగంగా వస్తున్నట్లు చూసి, బొలెరో డ్రైవర్ బ్రేకులను వేశాడు. SUV వేగం తగ్గి వెంటనే పూర్తిగా ఆగిపోయింది. మరోవైపు, బస్సు ఆలస్యంగా బ్రేకులు వేసి, బొలెరో ముందు భాగాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే, దృశ్యాలను చూస్తే, బొలెరో డ్రైవర్‌కు కఠినమైన గుణపాఠం నేర్పడానికి బస్సు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమే అని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ అది పోలీసు కారు అని ఆలస్యంగా తెలుసుకున్న సందర్భం కూడా కావచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదీ కాస్త వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ పాటించాల్సిన వ్యక్తులే, ఇలా తప్పు దారిలో వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..