- Telugu News Photo Gallery Are you unable to do anything because of overthinking? The best tips for you
అతిగా ఆలోచించి ఏ పని చేయలేకపోతున్నారా.. మీకోసమే బెస్ట్ టిప్స్
అతి ఆలోచన అనేది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటారు. కొన్ని సార్లు ఇది పెను ప్రమాదానికి కారణం కావచ్చు. అతిగా ఆలోచన వలన ఏ పని సరిగ్గా చేసుకోలేరు. అంతే కాకుండా చదువు, వర్క్ ఇలా దేనిపై శ్రద్ధ పెట్టలేరు. అందుకే ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడాలంట. కాగా, అసలు అతి ఆలోచన నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: May 30, 2025 | 8:30 PM

మీరు మీ ఆలోచనల నుంచి బయటపడాలంటే మీకు ఇష్టమైన పుస్తకం చదవడం లేదా.. కథల పుస్తకాలు, జోక్స్ ఉండే పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండాలంట. దీని వలన మీరు మీ ఆలోచనల నుంచి సులభంగా బయటపడగలుగుతారు.

అంతే కాకుండా రాయడం ఒక మంచి అలవాటు అంటారు. అయితే మీరు మీలోని ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడం వలన కూడా మీరు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చునంట. మీరు మీ ఆలోచనలు ఓ పుస్తకంపై రాయడం మొదలు పెడితే ఈ సమస్య నుంచి బయటపడతారు.

పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలంట. ఏది జరిగినా అంత మన మంచికే అనే విధంగా మీరు ఆలోచించగలిగితే,అతి ఆలోచన నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారంట. అంతే కాకుండా ఆనందంగా కూడా ఉండగలరంట.

మెడిటేషన్ అనేది మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తుంది. అందువలన అతిగా ఆలోచనలతో సతమతం అయ్యేవారు ప్రతి రోజూ తప్పకుండా మెడిటేషన్ చేయడం ముఖ్యంగా శ్వాసపై ధ్యాస పెట్టడం వలన అతిఆలోచనల నుంచి విముక్తి పొందుతారంట.

స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపడం వలన కూడా అతిగా ఆలోచించకుండా ఉంటారంట. ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా, స్నేహితులతో సరదాగా గడుపుతూ లేదా వారితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండటం వలన ఈ సమస్య నుంచి బయటపడతారంట.



