చేప మందు నిజంగానే ఆస్తమాను నయం చేస్తుందా?
తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధుల బారినపడుతున్నారు. అలాగే కొంత మంది ఆస్తమా, ఉబ్బసం వ్యాధి బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఓ శ్వాసకోశ వ్యాధి. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారు మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకుంటారు. చేప ప్రసాదం తీసుకుంటే అది తగ్గిపోతుందని వారి నమ్మకం. కాగా, నిజంగానే చేప ప్రసాదం ఆస్తమా వ్యాధిని నయం చేస్తుందా తెలుసుకుందాం?
Updated on: May 30, 2025 | 8:15 PM

ఆస్తమా వ్యాధి అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది దీని వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఊపిరితిత్తుల్లో వాపు వలన వాయు మార్గాలు కుచించుకపోయి శ్వాసకు ఆటంకం కలిగిస్తాయి. దాని వలన శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా వానాకాలం, శీతాకాలంలో ఈ సమస్య అనేది తీవ్రతరం అవుతుంది. అందువలన ఈ సీజన్‌లో ఆస్తమా పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు వైద్యులు. ఇక ఆస్తమా అనేది వంశపార్యపరంగా కూడా వస్తుంటుంది. ఇది ఉన్నవారికి రాత్రి పూట దగ్గు ఎక్కువగా రావడం,ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రాత్రి నిద్రలో ఈల శబ్ధం వంటివి వస్తుంటాయి.

ప్రస్తుతం ఆస్తమా వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఆస్తమాతో బాధపడగా, అందులో ఐదుశాతం చిన్నపిల్లలు ఉన్నారంట. అయితే ఆలెర్జీ, దుమ్ము వలన ఈ సమస్య తీవ్రతరం అవుతుంది.

అయితే చాలా మంది ఎన్నోరకాల మందులు వాడుతున్నప్పటికీ ఆస్తమా మాత్రం పూర్తిగా తగ్గలేదు అని వాపోతుంటారు.అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది చేప వైద్యంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.ఎందుకంటే చాలా మంది ఆస్తమాను చేపల మందు తగ్గిస్తుందని నమ్ముతుంటారు. ఒక సారి కాకుండా రెడు లేదా మూడు సార్లు చేమ మందు తీసుకోవడం వలన ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుదని చెబుతుంటారు.

అయితే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ కుటుంబం ప్రతి సంవత్సరం ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము సమస్యలతో బాధపడే వారికి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జూన్ 8న ఆదివారం రోజున చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.



