AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు పదే పదే ఉద్యోగాలు మరుస్తారట.. ఏ కేరేర్ ని ఎంచుకుంటే బెస్ట్ అంటే..

వ్యక్తి నడవడిక, మంచి చెడులను గురించి తెలుసుకోవాలంటే కొంతమంది జోతిష్య శాస్త్రాన్ని నమ్మితే.. మరి కొందరు సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకుంటారు. దీనినే న్యూమరాలజీ అని కూడా అంటారు. ఈ రోజు మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఎక్కువ కాలం ఒకే ఉద్యోగం చేయలేరు. రకరకాల రీజన్స్ తో వీరు తరచుగా తమ ఉద్యోగాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఈ రోజు ఏ తేదీలలో జన్మించిన వారు ఒకే ఉద్యోగం చేయరో తెలుసుకుందాం..

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు పదే పదే ఉద్యోగాలు మరుస్తారట.. ఏ కేరేర్ ని ఎంచుకుంటే బెస్ట్ అంటే..
Numerology
Surya Kala
|

Updated on: May 30, 2025 | 8:11 PM

Share

ప్రతి వ్యక్తి సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలలో బాగా రాణిస్తే, చాలా మంది వ్యాపారాన్ని చక్కగా నిర్వహిస్తారు. ఎవరైనా సరే ఏపని చేయడంలో తమకు నైపుణ్యం ఉందో ఆ పనినే వృత్తిగా ఎంచుకుంటే సక్సెస్ అవుతారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొంతమందికి ప్రతిభ ఉన్నా.. ఎంత కష్టపడినా సరే ఉద్యోగం పొందలేరు. అదే సమయంలో కొంతమంది తమకు దొరికిన ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండలేరు. తక్కువ సమయంలో ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగం లోని మారుతూ ఉంటారు. అంటే చాలా తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు.

సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీ అంటే అతని మూల సంఖ్య సహాయంతో.. అతని స్వభావం, అలవాట్లు, వృత్తి , రంగు మొదలైన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఏ తేదీన పుట్టిన వ్యక్తులు ఒకే ఉద్యోగాన్ని స్థిరం చేయరో తెలుసుకుందాం.. వీరి ఏదో ఒక కారణం చేత ఉద్యోగం కోసం ఇక్కడ, అక్కడ తిరుగుతూ ఉంటారు.

ఏ వ్యక్తులు ఒకే ఉద్యోగంలో ఉండలేరంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వారి మనస్సు చంచలమైనది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఏ ప్రదేశంలోనూ ఎక్కువసేపు ఉండలేరు. వీళ్ళకు ఒకే రకమైన వస్తువులను పదే పదే ఉపయోగించడం, ఒకే ప్రదేశం లో ఎక్కువ రోజులు ఉండడం అంటే చాలా త్వరగా విసుగు పుడుతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తులు ఉద్యోగాన్ని ఎక్కువ సమయం చేయలేరు. అందువల్ల వీరు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి త్వరగా మారాలని కోరుకుంటారు.

ఇవి కూడా చదవండి

6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వ్యక్తులు తమను తాము చాలా ప్రేమించుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఫిట్‌గా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కడైనా అందమైన వస్తువు కనిపిస్తే చాలు ఆకర్షింపబడతారు. వీరు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకు మోసం చేయడం తెలియదు. తాము ప్రేమించే వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. తమ స్నేహితులను, సన్నిహితులను బాధపెట్టే ఏ పనినీ ఎప్పుడూ చేయరు.

వీరు ఏ రంగంలో కెరీర్ ఎంచుకోవాలి? 6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వారి పాలక గ్రహం శుక్రుడు. శుక్రుడిని కళలను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. ఈ వ్యక్తులు ఏదైనా సృజనాత్మక పనిని ఎంచుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళ, ఫ్యాషన్, సంగీతం,యు మోడలింగ్ వంటి సృజనాత్మక రంగాలలో కెరీర్‌ను ఎంచుకోవడం మంచిది. అంతేకాదు వీరు ఆహారం, బట్టలు, విలాస వస్తువులు, బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలకు సంబంధించిన వ్యాపారం కూడా చేయవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!