AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వంట గదికి ఈ రంగులు వేయడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి..

ఇంట్లో వంటగదికి ప్రత్యేక స్థానం ఉంది. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లోని సభ్యులు అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే వంట గది విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు వంట గదికి వేసే రంగులతో ఆ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి. ఈ రోజు వంట గదిలో ఏ రంగులు వేయడం వలన ఇల్లు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉంటుందో తెలుసుకుందాం..

Vastu Tips: వంట గదికి ఈ రంగులు వేయడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి..
Vastu Tips
Surya Kala
|

Updated on: May 30, 2025 | 4:56 PM

Share

ఇంటిలో ఎన్ని గదులున్నా సరే వంట గది మాత్రం వెరీ వెరీ స్పెషల్. అందుకనే వంట గదిని, అందులో పెట్టుకునే గ్యాస్ స్టవ్ సహా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు. వంటగదిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కనుక కిచెన్​ విషయంలో వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం వంటగదిలో ఉంచాల్సినవి, ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయంటున్నారు. కిచెన్ లో పెట్టే వస్తువులు మాత్రమే కాదు కిచెన్ కు వేసే రంగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం వంట గదికి ఏ రంగులు వేసుకోవాలో తెలుసుకుందాం..

వాస్తవానికి రంగులు మన చుట్టూ ఉన్న శక్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు లేదా వంటగదిని అలంకరించేటప్పుడు, దిశ ,రంగును దృష్టిలో ఉంచుకుంటారు. వంట ఇంట్లో స్టవ్ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంటే దాని చుట్టూ ఆకుపచ్చ రంగు వేయండి. ఈ రంగు అక్కడి శక్తిని సమతుల్యం చేస్తుంది. సానుకూల ఫలితాలను ఇస్తుంది.

పొయ్యి దక్షిణ లేదా నైరుతి దిశలో ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఈ గోడకు పసుపు రంగు వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు రంగు వేడి, శక్తిని నియంత్రిస్తుంది. ఇది వంటగదిలో వేడిని సమతుల్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

పొయ్యి అగ్ని కోణంలో అంటే ఆగ్నేయ దిశలో ఉంటే మట్టి.. ప్రాథమిక రంగు సరిపోతుంది. ఈ రంగు ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది. కనుక మెరూన్ కలర్ వేసుకోవాలి.

గ్రామాల్లో నివసించే ప్రజలు సున్నం లేదా పెయింట్ ఉపయోగించి వంట గదిలో ఈ రంగులను సులభంగా వేసుకోవచ్చు. ఈ రంగులు వంటగదిని అందంగా కనిపిచేలా చేయడమే కాదు సానుకూల శక్తిని కూడా తీసుకొస్తాయి.

అదే పట్టణాలు లేదా తక్కువ ఆధునిక సౌకర్యాలు ఉన్న ఇంట్లో నివసిస్తుంటే.. ఈ పద్ధతిని అనుసరించేందుకు టైటిల్ ను ఈ రంగుల్లో అమర్చుకోండి. తేడాను మీరే అనుభవించండి. మీ జీవితంలో మార్పులు జరగవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...