AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: పిల్లల్లో ఈ లక్షణాలుంటే వంశానికే వెలుగు.. అలాంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు!

మహాభారతంలోని హస్తనకు రాజైన ధృతరాష్ట్రుడు.. ప్రధాన మంత్రి విదురుడికి మధ్య జరిగిన సంభాషణ భారతీయ సంస్కృతి ,నైతిక విద్యకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది. విదుర్ నీతిలో పిల్లల సద్గుణాలు, లోపాల విశ్లేషణ నేటికీ సందర్భోచితంగా ఉంటుంది. విదర నీతి ప్రకారం పిల్లలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి.. వారి జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మరి ఈ రోజు విరుదురు చెప్పినట్లుగా పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

Vidura Niti: పిల్లల్లో ఈ లక్షణాలుంటే వంశానికే వెలుగు.. అలాంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు!
Vidura Niti
Surya Kala
|

Updated on: May 30, 2025 | 4:18 PM

Share

జీవితంలోని దాదాపు అన్ని అంశాలు విదురు నీతిలో చర్చించబడ్డాయి. ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగిన సంభాషణలోని ఈ భాగం భారతీయ సంస్కృతి, నైతిక విద్యకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది. విదుర నీతిలోని ఈ సందేశం నేటి తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడి ప్రశ్నలు.. విదురుడి సమాధానాలు పిల్లల లక్షణాలు అతని సొంత జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం కుటుంబం జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ లక్షణాలను పిల్లలలో పెంపొందించినట్లయితే.. కుటుంబం మాత్రమే కాదు..మొత్తం సమాజం సంపన్నంగా, సంతోషంగా ఉంటుంది. పిల్లల్లో ఉండాల్సిన ఆ అద్భుతమైన లక్షణాలు ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..

పిల్లలకు ఉండాల్సిన 10 విలువైన లక్షణాలు

  1. గౌరవం, సంస్కృతి: పెద్దల పట్ల గౌరవం, మంచి సంస్కృతి పిల్లలను కుటుంబానికి గర్వకారణంగా మారుస్తాయి. ఈ గుణమే వారిని సమాజంలో ఆదర్శంగా నిలబెడుతుంది.
  2. సత్యం – నిజాయితీ: సత్యం మాట్లాడుతూ.. నిజాయితీని అనుసరించే పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాదు ఇతరుల నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు.
  3. జ్ఞానం కోసం తీరని దాహం: కొత్త విషయాలు నేర్చుకోవడంలో, చదువుకోవడంలో ఆసక్తి ఉన్న పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. జ్ఞానం కోసం తపన వారి భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది.
  4. ధైర్యం- ఓర్పు: క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం ప్రదర్శించడం.. ఓర్పును కలిగి ఉండడం వల్ల పిల్లలు ప్రతి సవాలును ఎదుర్కోగలుగుతారు.
  5. న్యాయం – వివేకం: ఏది సరైనది.. ఏది తప్పు.. అంటే తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం, న్యాయం అన్యాయం అనే భావన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి మేలు చేసేవారిగా ఈ లక్షణాలు తీర్చిదిద్దుతాయి.
  6. మధురమైన ప్రసంగం: మధురంగా ​​మాట్లాడే కళ పిల్లల వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ గుణం సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
  7. మనస్సాక్షి- కృషి: సమయానికి తమ బాధ్యతలను నిర్వర్తించి, కష్టపడి పనిచేసే పిల్లలు కుటుంబానికి , సమాజానికి ఒక ఉదాహరణగా మారతారు.
  8. దయ- సానుభూతి: ఇతరులకు సహాయం చేయడం, దయగా ఉండటం వల్ల పిల్లలు సమాజంలో గౌరవం పొందుతారు. ఈ గుణం వారి హృదయాన్ని విశాలం చేస్తుంది.
  9. క్రమశిక్షణ – సమయపాలన: క్రమశిక్షణ, సమయపాలన పాటించే పిల్లలు తమ లక్ష్యాలను సులభంగా సాధించి జీవితంలో విజయం సాధిస్తారు.
  10. నైతిక విలువలు- సహనం: మతపరమైన, నైతిక విలువలను, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సహనం కలిగి ఉండడం అనే గుణం వలన పిల్లలు బలమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారుగా ఎదుగుతారు.

విదుర్ నీతి అనేది మానవ జీవితం ఒక కళ అని తెలియజేసే ఒక అద్భుతమైన పుస్తకం. పైన పేర్కొన్న పిల్లల లక్షణాలు.. పిల్లల ప్రాముఖ్యత గురించి కూడా ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు