AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Mosquito Bats: ఈ దోమల బ్యాట్‌లతో దోమలు పరార్… అందుబాటు ధరల్లో ఉండే మంచి దోమల బ్యాట్‌లు ఇవే

ఈ సమస్య నుంచి బయటపడేందుకు దోమల బ్యాట్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. మొదట్లో అవి మంచిగా పని చేసినప్పటికీ తక్కువ ధరల్లో చైనా మేడ్ దోమల బ్యాట్‌లు రావడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.

Best Mosquito Bats: ఈ దోమల బ్యాట్‌లతో దోమలు పరార్… అందుబాటు ధరల్లో ఉండే మంచి దోమల బ్యాట్‌లు ఇవే
Mosquito Bat
Nikhil
|

Updated on: Apr 18, 2023 | 10:28 PM

Share

వేసవిలో ఎండలతో పాటు దోమలు కూడా బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో చల్లదనం కోసం సాయంత్రం సమయంలో ఆరుబయట కూర్చొంటే చాలు దోమలు దాడి చేస్తాయి. దోమల కుట్టడం వల్ల అనేక రోగాలు కూడా వ్యాప్తి చెందుతాయి. దోమల సమస్య నుంచి రక్షణకు మొదట్లో దోమల కాయిల్స్, క్రమేపి ఆల్ అవుట్ వంటివి వచ్చాయి. అవి పని చేసినా దోమల సమస్య నుంచి మాత్రం గట్టెక్కలేము. ముఖ్యంగా ఆరుబయట సేదతీరే సమయంలో వాటిని పెట్టుకోలేము. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు దోమల బ్యాట్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. మొదట్లో అవి మంచిగా పని చేసినప్పటికీ తక్కువ ధరల్లో చైనా మేడ్ దోమల బ్యాట్‌లు రావడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అయితే నాణ్యతపరంగా అవి మంచిగా లేకపోవడంతో కొనుగోలు చేసిన రోజుల వ్యవధిలోనే అవి పని చేయడం లేదు. దీంతో ప్రజలు ఏ కంపెనీ దోమలు బ్యాట్ కొనుగోలు చేయాలో? అర్థం కావడం లేదు. అయితే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలతో తయారు చేసిన దోమలు బ్యాట్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్వాలిటీ దోమలు బ్యాట్‌లు గురించి ఓ సారి తెలుసుకుందాం.

హిట్ యాంటీ మస్కిటో రాకెట్

ప్రఖ్యాత దోమల బ్యాట్‌ల తయారీదారు నుంచి వచ్చిన ఈ బ్యాట్ దోమలను చంపడానికి బాగా ఉపయోగపడుతుంది. హిట్ దోమల బ్యాట్ ఓ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మీ ఫర్నిచర్ కింద, గది మూలల్లో దాగి ఉన్న దోమలను వెతికి చంపడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యాట్‌ను ఏబీఎస్ ప్లాస్టిక్‌ నుంచి తయారు చేస్తున్నారు. ఈ దోమల రాకెట్‌లో బలమైన 400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే ఇది ఒక నెల పాటు నిరంతరంగా పని చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ బ్యాట్‌లో ఎల్ఈడీ లైట్, రెడ్ గ్లో ఇండికేటర్, పవర్ ఆన్ లేదా ఆఫ్ చేయగల టోగుల్ స్విచ్ ఉన్నాయి. ఈ బ్యాట్ ధర రూ.483గా ఉంది. 

ఎర్త్ రేటెడ్ మస్కిటో రాకెట్

సమర్థవంతమైన, ఉత్తమమైన దోమల బ్యాట్ కోసం చూసేవారికి ఇదో మంచి బ్యాట్. ఇది దోమలకే కాకుండా వివిధ రకాల కీటకాలకు వ్యతిరేకంగా చాలా మంచిగా పని చేస్తుంది. ఈ దోమల రాకెట్ స్టైలిష్ వైట్, బ్లూ లుక్ ప్రత్యేక స్విచ్‌తో ప్రత్యేక డిజైన్‌తో వస్తుంది. ఈ దోమల బ్యాట్‌ను కూడా ఏబీఎస్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. నికెల్-ప్లేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ మెస్, అలాగే ఇన్నర్ లేయర్ అల్యూమినియం మెస్‌తో ఈ బ్యాట్‌ రూపొందించారు. ఈ దోమల బ్యాట్ ఖరీదు రూ.799గా ఉంది.

ఇవి కూడా చదవండి

వోల్ఫ్ దోమల రాకెట్

విర్డ్ వోల్ఫ్ దోమల రాకెట్ దృఢమైన, ట్రిపుల్-లేయర్డ్ మెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాట్‌లో 500 ఎంఏహెచ్ రీఛార్జ్‌బుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక నెల స్టాండ్‌బై వరకు శక్తిని నిల్వ చేయడం  ఈ బ్యాట్ ప్రత్యేకత. ఏబీఎస్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపొందించిన ఈ రాకెట్ తేలికగా ఉండడంతో పాటు సౌకర్యంగా కూడా ఉంటుంది. ఎల్ఈడీ లైట్ సహాయంతో దోమలను చంపడానికి వీలుగా ఉంటుంది. ఈ బ్యాట్ ధర రూ.577.

మిస్టర్ రైట్ మస్కిటో బ్యాట్

మిస్టర్ రైట్ నుంచి నాలుగు విభిన్న రంగుల్లో వచ్చే ఈ దోమల బ్యాట్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన్నికైన డిజైన్ దోమలను పట్టుకోవడంలో, బంధించడంలో అద్భుతమైన పట్టును ఇస్తుంది. ఈ దోమల రాకెట్ ఒక అంతర్నిర్మిత ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. అలాగే 2500వీ డీసీ వోల్టేజ్‌తో శక్తిని పొందుతుంది. 30 రోజుల స్టాండ్‌బై మోడ్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దోమల బ్యాట్ 10 రోజుల వరకు ఉంటుంది. అలాగే ఈ దోమల బ్యాట్ ధర రూ.399.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..