Milk Tea: భారతీయులు టీలో పాలు ఎందుకు కలుపుతారు..? అసలైన కారణం ఇదే!
Milk Tea: టీని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర యాడ్ చేయాలని సూచించారు. ఈ ఐడియా క్లిక్ అయింది. భారతీయులు బ్రిటీష్ వారి టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఈ క్రమంలో భారతీయులు తమ అభిరుచి మేర ప్రయోగాలు చేశారు. ప్రతి ఇంట్లో..

Milk Tea: భారతదేశం రుచికరమైన మసాలా చాయ్‌కి ప్రసిద్ధి చెందింది. అయితే భారతదేశంలో మాత్రమే మిల్క్ టీ తాగుతారనే నమ్మకం తప్పు. ప్రపంచవ్యాప్తంగా టీ తాగడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు పాలు, చక్కెరతో ఇష్టపడతారు. మరికొందరు దీనిని బ్లాక్ టీగా ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా టీ ఎలా తాగుతారో తెలుసుకుందాం.
భారతదేశంలో టీలో పాలు ఎందుకు కలుపుతారు?
టీ బ్రిటిష్ పాలనలో భారతదేశానికి వచ్చింది. 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు పోటీగా తన టీ వ్యాపారాన్ని స్థాపించినప్పుడు భారతదేశంలో టీ విస్తృతంగా ఉండేది. 1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులలో టీని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పాలు, చక్కెరను జోడించాలని సూచించారు. క్రమంగా ఈ అలవాటు పెరిగిపోయింది. వలసరాజ్యాలతో మొదలైన అలవాటు టీ భారతదేశంలో పుట్టలేదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది. ప్రపంచ టీ వ్యాపారంలో చైనా ఆధిపత్యంతో పోటీ పడటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున టీ సాగును ప్రారంభించింది. మొదట్లో భారతీయుల కోసం టీ సాగు చేయలేదు. ఎగుమతి కోసం, బ్రిటిష్ ఉన్నత వర్గాల కోసం పండించారు.
ఇది కూడా చదవండి: Post office: పోస్టల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సేవలు 24 x 7 అందుబాటులో..
టీని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర యాడ్ చేయాలని సూచించారు. ఈ ఐడియా క్లిక్ అయింది. భారతీయులు బ్రిటీష్ వారి టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఈ క్రమంలో భారతీయులు తమ అభిరుచి మేర ప్రయోగాలు చేశారు. ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే పాలను టీకి జోడించడంతో కొత్త రుచి వచ్చింది. అలా, ప్రస్తుతం మనం తాగే టీ ఉనికిలోకి వచ్చింది. బ్రిటిష్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కైట్ అయింది. తక్కువ కాలంలోనే లక్షలాది మందికి టీ లేనిదే రోజు గడవని పరిస్థితి వచ్చింది. టీ కోసం పాలు వాడకం భారత్‌లో ప్రత్యేకమైనది. భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లలో మిల్క్ టీ తాగుతారు. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. అతిథులను పలకరించడానికి, రోజును ప్రారంభించడానికి కూడా ఒక మార్గం. కొన్ని దేశాల్లో పాలు కలుపకుండా కేవలం నీటిలో తేయాకు కలుపుకొని తయారు చేసుకుంటారు. తేయాకు రుచిని యథాతథాంగా ఆస్వాదించాలని భావించిన ఇతర దేశాలు మాత్రం కేవలం నీటితో టీ చేసుకోవడాన్ని కొనసాగించాయి.
ఇది కూడా చదవండి: Metro Train: మెట్రోలో ఇలాంటివి తీసుకెళ్తున్నారా? భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే!
బ్రిటన్‌లో 17వ శతాబ్దం నుండి టీలో పాలు కలపడం అలవాటుగా ఉంది. బ్రిటిష్ వారు బ్లాక్ టీని పాలు చిలకరిస్తూ ఆస్వాదిస్తారు. దీనిని హై టీ అని పిలుస్తారు. సున్నితమైన పింగాణీ కప్పుల్లో వేడి టీ పోసేటప్పుడు అవి పగలకుండా ఉండటానికి పాలు కలిపే పద్ధతిని మొదట్లో ప్రవేశపెట్టారు. తూర్పు ఆసియాలోని తైవాన్, బబుల్ టీని కనుగొంది. ఇది పాలు, నమిలే టేపియోకా ముత్యాల తీపి మిశ్రమం. థాయిలాండ్ ప్రసిద్ధ థాయ్ టీ బలమైన బ్లాక్ టీ, చక్కెర, గాడిద పాలతో తయారు చేస్తారు. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 29 వరకు పాఠశాలలు బంద్.. కారణం ఏంటంటే..
మలేషియా, సింగపూర్‌లలో పాల టీని టెహ్ తారిక్ అని పిలుస్తారు. అంటే వడకట్టిన టీ. నురుగు ఏర్పడటానికి దీనిని ఒక కప్పు నుండి మరొక కప్పుకు పదేపదే పోస్తారు. చైనా, జపాన్‌లలో టీని ఒక కళారూపంగా పరిగణిస్తారు. ఆకుల స్వచ్ఛత, వాసనను కాపాడటానికి ఆకుపచ్చ, ఊలాంగ్, బ్లాక్ టీలను పాలు లేకుండా తీసుకుంటారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీ వినియోగదారుడైన టర్కీ, చిన్న గ్లాసుల్లో పాలు లేకుండా బలమైన బ్లాక్ టీని తాగుతుంది.
ఇది కూడా చదవండి: SUV Scooter: భారతదేశపు మొట్టమొదటి SUV స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!




