- Telugu News Photo Gallery Optical Illusion: Spot the lollipop in the middle of the ice creams in the image above
Optical Illusion: మీరు తెలివైన వారా.. 10 సెకన్స్‌లో ఐసీక్రీమ్స్ మధ్యలోని లాలీపాప్ గుర్తించండి!
ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును మెుగుపరుస్తుంది. ఇది దృష్యనైపుణ్యాన్ని కూడా తెలుపుతుంది. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్ లాంటి సమస్యలను పరిష్కరించినప్పుడు కలిగే ఆనందం మాట్లలో చెప్పలేనిది.దీని వలన ఆనందం కలగడమే కాకుండా, నాలెడ్జ్ కూడా ఇంఫ్రూవ్ అవుతుంది.
Updated on: Oct 23, 2025 | 1:32 PM

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ పజిల్ గేమ్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలా ఎక్కువగా ఇష్టపడి ఆడుతుంటారు. ఇలాంటివి సాల్వ్ చేస్తున్నప్పుడు కలిగే ఆనదం మాటల్లో చెప్పలేనిది. అలాగే ఇలాంటి ఆటలు మైండ్ పవర్‌ను పెంచుతాయి. అయితే మీరు కూడా ఇలాంటివి సాల్వ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్న ఓ ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాను.

అది ఏమిటంటే? పై చిత్రంలో ఐస్ క్రీమ్స్ ఉన్న ఓ ఫోటో కనిపిస్తుంది. అందులో దాదాపు అన్ని ఐస్ క్రీమ్స్ ఒకేలా ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ఒక లాలీపాప్ కూడా ఉంది. మరి అందులో లాలీపాప్ ఎక్కడ ఉందో 10 సెకన్స్‌లో గుర్తించండి. అలా గుర్తించినట్లు అయితే మీరు చాలా తెలివిగలవారంట.

కేవలం 10 సెకన్స్ లో లాలీపాప్ గుర్తిస్తే మీరు చాలా ఇంటలీజెంట్స్. ఇలాంటి పజిల్స్ పరిష్కరించడం వలన మన ఆలోచన నైపుణ్యం పెరగుతుంది. అంతే కాకుండా ఇది కొత్త పరిష్కార మార్గాలు కనుగొనడానికి మనల్ని సిద్ధం చేస్తుంది.

ఏంటీ ఇంకా మీకు లాలీ పాప్ కనిపించడం లేదా? ఎక్కడ ఉందా అని వెతుకుతున్నారా? అయితే కంగారు పడాల్సిన పనేలేదు. ఎందుకంటే మీ కోసమ మేము సమాధానం కూడా ఇచ్చాం. దీని బట్టి మీరు గుర్తించింది సరైనదో కాదో తెలుసుకోండి.



