- Telugu News Photo Gallery Cinema photos Prabhas Birthday Special, Do You Know Darling Net Worth and Car Collections
Prabhas : ఇండస్ట్రీలో రారాజు.. ప్రభాస్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? డార్లింగ్ కార్ కలెక్షన్ చూస్తే అంతే ఇక..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు ఫ్యాన్స్, సినీతారలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే డార్లింగ్ త్రోబ్యాక్ వీడియోస్, ఫోటోస్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే డార్లింగ్ సంపాదన, ఆస్తులు, కార్ కలెక్షన్స్, రెమ్యునరేషన్ విషయాలు సైతం సెర్చ్ చేస్తున్నారు.
Updated on: Oct 23, 2025 | 1:38 PM

దివంగత హీరో కృష్ణ రాజు నటవారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న డార్లింగ్.. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత చత్రపతి, మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు.

ముఖ్యంగా డెరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం ప్రభాస్ ఆస్తులు రూ.250 కోట్లు ఉంటుందని టాక్. అలాగే ఇటలీతోపాటు భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ముందున్నారు. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

ప్రభాస్ వద్ద ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది. ఆయన వద్ద లంబోర్గిని అవెంటడోర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, జాగ్వార్ XJ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే నిర్మాణ రంగంతోపాటు పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ ప్రభాస్ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్.

సినిమాల విషయానికి వస్తే..డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అలాగే కల్కి 2, సలార్ 2 చిత్రాలు సైతం మొదలుకానున్నాయి.




