AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మను నమ్మకండి.. అతిగా తీసుకుంటే ప్రమాదమే!

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి రోజూ నిమ్మరసం తాగడం వలన జీర్ణ సమస్యలు తగ్గిపోతాయని చెబుతుంటారు ఆరోగ్యనిపుణులు. అయితే నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, నిమ్మను నమ్మకంటున్నారు నిపుణులు. ఎందుకంటే, నిమ్మకాయను అతిగా తినడం వలన అనేక సమస్యలు వస్తాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: |

Updated on: Oct 24, 2025 | 1:48 PM

Share
జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనంలో నిమ్మకాయల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. నిమ్మలో అధిక ఆమ్లతత్వం గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారిలో ఇది లక్షణాలను మరింత  తీవ్రతరం చేస్తుంది. అంతే కాకుండా, దీని వలన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట.

1 / 5
నిమ్మకాయ ఆరోగ్యానికి, కిడ్నీ హెల్త్ కి కూడా మంచిది. దీని తొక్కలో ఫ్లేవనాయిడ్లు, పోషకాలు ఉన్నప్పటికీ, ఇందులో ఉండే  ఆక్సలేట్లు  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదపడతాయంట. నిమ్మకాయ అతిగా తినడం వలన ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని మరింత పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
నిమ్మకాయ అతిగా తినడం వలన కొంత మందిలో అలెర్జీ సమస్యలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. నిమ్మ దురద, వాపు వంటి తీవ్రమైన ప్రతి చర్యలను కలిగి ఉంటుంది. దీనిని నేరుగా మీ చర్మంపై రాసుకోవడం వలన ఇది ఫోటో సన్సిటివిటీ పెంచే లక్షణం ఎక్కువగా  ఉంటుంది. ఆ సమయంలో చర్మం వడదెబ్బకు గురి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

3 / 5
కొందరు తమకు తెలియకుండానే నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటుంటారు. నిమ్మకాయకు సంబంధించిన ఉత్పత్తులను అధికంగా వాడుతుంటారు. అయితే ఇలా నిమ్మకాయను అతిగా తీసుకోవడం వలన ఇది మూత్రసంబంధ సమస్యలు, టైరమైన్ వంటి సమ్మేళనాల కారణంగా విరేచనాలు, తరచూ మూత్ర విసర్జన, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంట.

4 / 5
నిమ్మకాయలలోని సిట్రిక్ ఆమ్లం ఎక్కువ మొతాదులో ఉంటుంది. అయితే ఇది వరం అయినప్పటికీ ఇది  ఓ శాపం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని అధికంగా తీసుకోవడం వలన దంత క్షయ ప్రమాదం పెరుగుతుందంట. అలాగే, అధిక ఆమ్లతత్వం కారణంగా, గుండెల్లో మంట, వికారం, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో నిమ్మకాయను అతిగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు.

5 / 5