Watermelon: పుచ్చకాయ తినేటప్పుడు పొరబాటున విత్తనం మింగేశారా? కడుపులో ఏం జరుగుతుందో తెలిస్తే..
వేసవిలో అధికంగా లభ్యమయ్యే పుచ్చకాయ.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉండటం వల్ల నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అలాగే విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు సైతం పుష్కలంగా ఉంటాయి.

పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన వేసవి పండు. ఇది వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉండటం వల్ల నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అలాగే విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు సైతం పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడే రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ మాత్రమే కాదు, ఇందులోని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
జీర్ణవ్యవస్థ
పుచ్చకాయ మధ్య భాగంలో పొటాషియం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
మెరిసే చర్మం
చర్మ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా పుచ్చకాయ గింజలు తినాలి. ఎందుకంటే వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది.
బరువు తగ్గడం
పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
రోగనిరోధక శక్తి
పుచ్చకాయ గింజలు తినడం వల్ల జింక్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడానికి జింక్ పనిచేస్తుంది. కాబట్టి అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వులు
మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో అధికంగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండెపోటు, స్ట్రోక్‌లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నాడీ వ్యవస్థ
పుచ్చకాయ గింజలలో విటమిన్ బి ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిత్తవైకల్యం లేదా ఏదైనా మానసిక సమస్యతో బాధపడేవారు పుచ్చ గింజలు తప్పక తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.




